FIFA 22 ప్రపంచ కప్‌కు అంగరంగ వైభవంగా రెడీ అవుతున్న ఖతార్!

FIFA 22 ప్రపంచ కప్‌ కోసం ఆతిథ్యం ఇచ్చేందుకు అంగరంగ వైభవంగా రెడీ అవుతున్నాయి ఖతార్‌లోని స్టేడియంలు.అవును… ఈ సంవత్సరం నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే FIFA ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది ఖతార్‌.దీని కోసం అవసరమైన మౌళిక సదుపాలయాలను ఇప్పటికే సిద్దం చేసింది ఆదేశ గవర్నమెంట్.ఈ సంవత్సరం దేశంలో జరుగుతున్న ఫుట్‌బాల్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాభిమానులు తరలి వచ్చే సూచనలు వున్నాయి.

 Qatar Ready For Fifa 22 World Cup-TeluguStop.com

ఈ నేపథ్యంలో క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎక్కడా రాజీపడకుండా వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

ఖతార్‌లో దానికోసం సుమారు 8 భారీ క్రీడా ప్రాంగణాలు సన్నద్ధం అవుతున్నాయి.ఇందులో అతి పెద్దది లుసైల్ ఐకానిక్ స్టేడియం.ఇక్కడ దాదాపు 80 వేల మంది స్టేడియంలతో కూర్చొని ఆటను తిలకించేందుకు వీటుగా ఉంటుంది.

ఇది సెంట్రల్ దోహాకు ఉత్తరాన 15 కిలోమీటర్ల దూరంలో సిద్ధం అవుతోంది.వరల్డ్ కప్ తర్వాత ఈ స్టేడియంను కమ్యూనిటీ హబ్‌గా మార్చే వీలుందంటున్నారు అక్కడి అధికారులు.

అలాగే దోహా నుండి 35 కిలోమీటర్ల దూరంలోని అల్ ఖోర్‌లో 60 వేల మంది క్రీడాభిమానులు తిలకించేందుకు వీలుగా అల్-బైట్ స్టేడియం సిద్ధమవుతోంది.

అల్-బైట్ స్టేడియంలో సెమీ ఫైనల్స్‌ జరగనున్నాయి.

మిగతా స్టేడియాలన్నీ 40 వేల మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మితం అవుతున్నాయి.ఇక స్టేడియంలు ఎక్కడెక్కడ కొలువుదీరుతాయంటే, దోహా సిటీలో ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం తయారు కాబోతుంది.

అలాగే అల్ తుమామా స్టేడియం, స్టేడియం 974 అనే క్రీడా ప్రాంగణాలు వేదికకానున్నాయి.ఇంకా అల్ రేయాన్‌లో ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం సిద్ధమవుతున్నాయి.

అలాగే అల్ వక్రాలో అల్ జనోబ్ అనే పేరుగల స్టేడియంను తాజాగా నిర్మించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube