కాలిఫోర్నియా లో కాఫీ రేటుకి..వామ్మో అనాల్సిందే

కాఫీ ధర మనకి తెలిసింది రూ.5 , 10 , మహా అయితే 100 లేదంటే ఓ భారీ షాపింగ్ మాల్ కి వెళ్లి తాగితే 500 ఉంటుంది.కానీ కాలిఫోర్నియా లో ఓ కేఫ్ లో కాఫీ ధర వింటే మాత్రం షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే.ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన కాఫీ గింజలతో ఈ కాఫీ ని తయారు చేస్తారట.సరే అసలు ఈ కేఫ్ లో కాఫీ రేటు ఏంతంటే అక్షరాలా 75 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లో రూ.5,256.ఏంటి షాక్ అయ్యారా మీరు విన్నది నిజమే ఇక్కడ ఒక కాఫీ తాగాలంటే ఆ మొత్తం చెల్లించాల్సిందే.

 Purchase The Worlds Most Expensive Coffee For 75 Dollors A Cup-TeluguStop.com

కాలిఫోర్నియా లోని క్లాచ్ కాఫీ అనే కాఫీ షాపుల్లో “ఎలిడ నేచురల్ గీషా 803” పేరుతో ఈ అత్యంత ఖరీదైన కాఫీ దొరుకుతుంది.

ఇక క్లాచ్ కాఫీకి దక్షిణ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కొ ఈ రెండు చోట్లా ఉండే బ్రాంచేస్‌లో మాత్రమే ఈ కాఫీ అందుబాటులో ఉంటుంది.ఈ కాఫీ గురించి శాన్ ఫ్రాన్సిస్కొ క్లాచ్ కాఫీ బ్రాంచ్ యజమాని మాట్లాడుతూ 803 అనేది ఇటీవల జరిగిన బెస్ట్ ఆఫ్ పనామా కాఫీ కాంపిటిషన్‌లో ఈ కాఫీ ఒక పౌండ్ గింజలు ఏకంగా 803 డాలర్లు పలికిందని అందుకే ఈ పేరు పెట్టినట్టుగా తెలిపారు.

కాలిఫోర్నియా లో కాఫీ రేటుకివ

అక్కడ జరిగిన ఈ వేలంలో ఈ రకానికి చెందిన కాఫీ గింజలు మొత్తం 45కిలోలు మాత్రమే అమ్మకానికి వఛాయనీ వాటిలో అధికభాగం జపాన్, చైనా ,తైవాన్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు.క్లాచ్ కాఫీకి కేవలం 4 .5 కిలోలు మాత్రమే దక్కాయని తెలిపారు.అత్యధిక నాణ్యత ఉండడంతో ఈ కాఫీ గింజలకు డిమాండ్ భారీ స్థాయిలో ఉందని తెలిపారు.

కాలిఫోర్నియా లో ఉండే వాళ్ళు ఓ సారి ఈ కాఫీ పై లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube