వైరల్: బురద స్నానం అనేది ఆరోగ్యానికి ఆయుర్వేదం అని చాటిచెబుతున్న శునకం!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో చెప్పడం ఎవరి తరమూ కాదు.అవును, ప్రతి రోజూ ఇక్కడ అనేక రకాల వీడియో స్టఫ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది.

 Puppy Taking Mud Bath Video Viral Details, Dog, Viral News, Video Video, Mud Bat-TeluguStop.com

ఈ క్రమంలో ఎక్కువగా జంతువులకు సంబందించినటువంటి వీడియోలే నెటిజన్ల మనసులని దోచుకుంటున్నాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువ వైరల్ అవ్వడం మనం చూస్తూ వున్నాం.

అలాగే అప్పుడప్పుడు వీధి కుక్కలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి.

ఇకపోతే పెంపుడు కుక్కలు అనేవి ఎప్పుడు చూసినా చాలా నీట్ గా కనిపిస్తాయి.

ఎందుకంటే వాటికి కేర్ టేకర్స్ వుంటారు కనుక.అదే వీధి కుక్కలను ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు మనకు కనబడవు.

అయితే పెంపుడు కుక్కలకి, వీధి కుక్కలకు ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే….ఒక సిటీలో పెరిగిన చిన్న పిల్లలకి, పల్లెటూళ్లలో పెరిగిన చిన్న పిల్లలకి ఉన్నంత తేడా ఉంటుంది.

ఇలాంటి పోలిక ఇక్కడ ఎందుకంటే సిటీలో పెరిగిన పిల్లలు చాలా సెన్సిబుల్ గా వుంటారు.అంటే వీరికి ఇమ్యూనిటీ కాస్త తక్కువగానే ఉంటుంది.

అదే పల్లెటూళ్లలో పెరిగినవారికి ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇపుడు దానిని నిజం చేస్తూ ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.‘ViralHog’ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఒక వీడియోని ఒకసారి గమనిస్తే ఈ వీడియోలో బురదలో పడి స్నానం చేస్తున్న ఒక కుక్కను మనం ఇక్కడ చూడవచ్చు.అందులోనే దానికి సంతోషం అని చెప్పకనే చెబుతుంది.

శరీరం నిండా బురదను పులుముకుని మరీ స్నానం చేయడం ఇక్కడ చూడవచ్చు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.

ఎక్కువమంది అది చాలా సంతోషంగా ఉందని, అలాగే బురద ఒంటికి పూసుకోవడం వలన కూడా కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయని దానికి తెలిసినట్టుగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube