వారసుడు ట్రైలర్ రిలీజ్.. పక్కా ఫ్లాప్ స్టోరీ అంటూ యూట్యూబర్ వీడియో!

తమిళ స్టార్ హీరో విజయ్ తళపతి హీరోగా నటించిన తాజా చిత్రం వారీసు.ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో విడుదలవుతున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.ఇది ఇలా ఉంటే తాజాగా వారీసు సినిమాకు సంబంధించిన టైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం.

 Youtuber Comments Varasudu Movie Trailer ,youtuber, Varasudu Movie, Varisu , Var-TeluguStop.com

అయితే ఆ సినిమాకు సంబంధించి అలాగే ఆ ట్రైలర్ కు సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశాడు యూట్యూబర్.అంతేకాకుండా ఇది పక్కా ఫ్లాప్ స్టోరీ అంటూ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.

తాజాగా వారిసు సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు అయితే చాలామంది తెలుగులో వారిసుడు ట్రైలర్ కోసం వెతికారు కానీ తెలుగులో విడుదల చేయలేదు కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు.

వాళ్ళు ఎక్కువగా తమిళ భాష పైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు అంతేకాకుండా హీరో విజయ్ వారసుడు సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఇక్కడికి రావడం లేదు అని యూట్యూబ్ కూడా తెలిపాడు.

అయితే సినిమా ట్రైలర్ విడుదలకు విజయ్ ని రమ్మని పిలవగా విజయ్ అందుకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టు కూడా తెలిపాడు.తెలుగులో ప్రమోట్ చేయడానికి రారు కానీ తెలుగులో వచ్చే కలెక్షన్స్ కావాలి తెలుగులో ఎక్కువ స్క్రీన్స్ కావాలి అని వ్యాఖ్యలు చేశాడు యూట్యూబర్.

అయితే చాలామంది వారీసు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి సినిమాలు ఇప్పటికే ఒక 100 వరకు వచ్చి ఉంటాయి.ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు ఇప్పటికే అలాంటి సినిమా స్టోరీలు ఎన్నో వచ్చాయి.

ఇందులోని స్టోరీ విషయానికి వస్తే.

జయసుధ, శరత్ కుమార్ ఇద్దరు భార్యాభర్తలు.వారికి ముగ్గురు పిల్లలు కాగా ఒకరు పెద్దన్నయ్య శ్రీకాంత్, సెకండ్ కిక్ షాం, మూడవ కొడుకు విజయ్ దళపతి. ఈ ముగ్గురు కొడుకులు తండ్రికి సంబంధించిన బిజినెస్ లు చూసుకుంటూ ఉండగా విలన్ ప్రకాష్ రాజు వచ్చి కలిసి ఉన్న కుటుంబాన్ని విడదీస్తాడు.

ఆ తర్వాత హీరో కుటుంబాన్ని ఎలా కలుపుతాడు అన్నదే రొటీన్ స్టోరీ.విడిపోయిన కుటుంబాలను కలిపే కథలు స్టోరీలు తెలుగులో ఎన్ని రాలేదు ఇందుకోసం మనం మళ్లీ డబ్బులు పెట్టి పోవాలా అని తెలిపారు యూట్యూబర్.

మధ్య మధ్యలో కామెడీ రష్మికతో రొమాన్స్ రెండు మూడు పాటలు ఇంతే, ఇంతకుమించి వారిసు సినిమా స్టోరీ మరి ఏమీ లేదు ఇది పక్కా ఫ్లాప్ స్టోరీ అని తెలిపారు యూట్యూబర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube