ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీరాజ్( Prudhvi Raj ) ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.వైసీపీ నుంచి పదవి పొందిన పృథ్వీరాజ్ కొన్ని కారణాల వల్ల ఆ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీ( JanaSena Party )లో చేరారనే సంగతి తెలిసిందే.
అయితే పృథ్వీరాజ్ కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండగా ఆమె వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మా నాన్న రాజకీయాలు చేయడం నాకు నచ్చదని పృథ్వీరాజ్ కూతురు శ్రీలు చెప్పారు.
కొత్త రంగుల ప్రపంచం అనే సినిమా ద్వారా శ్రీలు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.ఈ సినిమాకు పృథ్వీరాజ్ డైరెక్టర్ కాగా శ్రీలు ఈ సినిమాలో అవకాశం రావడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
</brఈ సినిమాలోని పాత్రకు నేను పూర్తిస్థాయిలో న్యాయం చేయగలనని భావించి మాత్రమే నాకు అవకాశం ఇచ్చారని పృథ్వీరాజ్ కూతురు చెప్పుకొచ్చారు.
యాక్టర్ గా నాన్న అంటే ఎంతో ఇష్టమని నాన్న రోల్స్ ను కామెడీ టైమింగ్ ను నేను ఎంతగానో ఇష్టపడతానని ఆమె అన్నారు.నాన్న రాజకీయాలకు సూట్ కారని రాజకీయాల్లోకి వెళ్లొద్దని నాన్నకు చాలా సందర్భాల్లో చెప్పానని అయితే నాన్నకు రాజకీయాలపై ఉన్న విపరీతమైన ఇష్టం వల్ల ఆయన నా మాట అస్సలు వినలేదని శ్రీలు పేర్కొన్నారు.సినిమా ఇండస్ట్రీలో ముందూ వెనుక జరిగే విషయాలను పట్టించుకోవద్దని నాన్న చెప్పారని శ్రీలు వెల్లడించారు.</br
నా పని నేను చేసుకోవాలని నాన్న సలహా ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో నాన్న నాకు స్పూర్తి అని శ్రీలు( Sreelu ) తెలిపారు.శ్రీలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.శ్రీలును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పృథ్వీరాజ్ కూతురు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.