టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ప్రియమణి.ఈ అమ్మడు కెరియర్ ఆరంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డుని సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో తెరంగేట్రం చేసింది.జగపతిబాబుకి జోడీగా ఆ సినిమా మెప్పించి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఎన్టీఆర్ కి జోడీగా రాజమౌళి యమదొంగ సినిమాలో ప్రియమణి ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.ఇదిలా ఉంటే తెలుగులో అవకాశాలు తగ్గిన తర్వాత మాతృభాషలో హీరోయిన్ గా స్టార్ హీరోలతో సండది చేసింది.
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మడు నటిగా తన ప్రస్తానం కొనసాగిస్తుంది.అయితే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు కాకుండా మంచి కథాబలం ఉన్న సినిమాలలో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో విరాటపర్వం సినిమాతో నారప్పలో వెంకటేష్ బార్యగా నటిస్తుంది.అలాగే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రాణిస్తుంది.ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించిన ప్రస్తుతం సీక్వెల్ లో కూడా ఈమె భాగంగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా హిందీలో హీజ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ఇందులో సాక్షి అనే చెఫ్ పాత్రలో ఆమె నటించింది.అయితే ఈ సందర్భంగా ఆమె ఒక విషయాన్ని రివీల్ చేసింది.
తనకి కనీసం గుడ్లు ఉడకబెట్టడం కూడా రాదని, అలాంటిది ఏకంగా చెఫ్ పాత్రలో నటించానని చెప్పుకొచ్చింది.షూటింగ్ సమయంలో నేను వంట చేసే విధానం చూసి అందరూ నవ్వుకునేవారని చెప్పింది.
అక్కడున్న అసిస్టెంట్లకి తనకంటే భాగా వంట చేయడం వచ్చని ప్రియమణి షూటింగ్ విశేషాలు పంచుకుంది.