TDP Janasena : టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పృథ్వీరాజ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP Elections )లో మరో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఏపీలో రాజకీయ ముఖచిత్రం చూస్తే 2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా సాగుతున్నాయి.

 Prithviraj Said How Many Seats Tdp Janasena Alliance Will Get-TeluguStop.com

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతుంది.విపక్ష పార్టీలు టీడీపీ జనసేన పార్టీ( TDP Janasena ) కలసి పోటీ చేస్తున్నాయి.

ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసే అవకాశం ఉన్నట్లు 2014 మాదిరి కూటమి ఏర్పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.బీజేపీతో పొత్తులకు సంబంధించిటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటన కూడా చేపట్టడం జరిగింది.

ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించారు.దాదాపు బీజీపీతో టీడీపీ పొత్తు ఖరారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు 21 ఎంపీ స్థానాలు వస్తాయని పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ మంత్రి రోజా( Minister Roja )పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో అంబటి రాంబాబుకు టికెట్ గల్లంతే.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన 26 పథకాలను సీఎం జగన్ తీసేశారు.రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పృధ్వీరాజ్( Actor Prudhvi Raj ) పిలుపునిచ్చారు.2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పృథ్వీరాజ్ తర్వాత వైసీపీ( YCP )కి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.అనంతరం జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube