కుటుంబీకుల ట్రస్ట్ ఆస్తి కేసు విషయంలో కోర్టుకు హాజరైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కామెంట్స్ ట్రస్ట్ వివాదంలో 16ఏళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నాను.
డిస్మిస్ అయిపోయిన కేసులను కొందరు న్యాయవాదులు ఉద్దేశ్య పూర్వకంగా తిరిగి తోడుతున్నారు.నా కేసులో సత్వర న్యాయం కోసం అభ్యర్ధిస్తున్నాను.
ఈ కేసు కారణంగా ఎంతో మంది వితంతువులు, అనాథలకు అందాల్సిన సహాయం ఆగిపోతోంది.అవినీతి కేసులు మద్దత్తు ఇస్తున్న న్యాయవాదులు తీరు మార్చుకోవాలి.
జడ్జిలు, న్యాయవాదులు దగ్గర జరుగుతున్న అవినీతి మీద పోరాడతాను.పరిష్కారం లభించక పోతే నిరాహారదీక్ష చేస్తాను.
కోర్టు సమయం వృధా పై సుప్రీంకోర్టు,హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు ఫిర్యాదు చేస్తాను.మన దేశం లో ఉన్న అవినీతి మరెక్కడ లేదు.
మునుగోడు లో ఈవిఎం లు మార్చుకుని టి ఆర్ ఎస్ ,బిజెపి లు రాజకీయాలు చేశారు.దేశములో, రాష్ట్రంలో ఉన్న నాయకులు పెయిల్ అయ్యారు.
ప్రజా పాలన రావాలి అంటే ప్రజా శాంతి పార్టీ రావాలి.