న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన తొలి తెలుగు సినిమా ఇదే !

వందల కోట్ల పెట్టుబడులు, ఉవ్విళ్లూరించే ప్రమోషన్స్.కోట్ల రూపాయల మొదటి రోజు కలెక్షన్స్.

 Unbelievable Records On Care Of Kancehrapalem Movie Details, C/o Kancherapalem,-TeluguStop.com

ఇవే కదా సినిమా అంటే.ఇందుకే కదా సినిమా తీసేది.

నేటి రోజుల్లో ఒక వారం సినిమా ఆడితే చాలు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.మరో వైపు కుదిరినన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా వేస్తే చాలు.

నచ్చిన నచ్చకపోయినా, ప్రేక్షకుడు చచ్చినట్టు అదే సినిమాను చూస్తాడు.కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.

ఛండాలంగా ఉన్న కూడా ఆ లోగ తీసినోడు సేఫ్.ఒకవేళ సినిమాలో మ్యాటర్ లేదు అనే మౌత్ టాక్ బయటకు వచ్చేలోపు సినిమా రీల్ స్టోర్ రూమ్ కి వెళ్ళిపోతుంది.

ఇది అండి అస్సలు సిసలైన 21 వ శతాబ్దపు సినిమా తీరు.అందుకే మంచి సినిమాకు నిర్మాత ఉండదు, థియేటర్ దొరకదు.అది ఎలా ఉందో తెలుసుకొని ఏ ఓటిటి లోనో చూడాలి.కానీ మనిషిని కదిలించే మనసుల్లో నిలిచే సినిమాలు ఎన్ని వస్తున్నాయి అబితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి.

అలాంటి ఒక అద్భుతమైన సినిమాల్లో ఒకటి కేరాఫ్ కంచరపాలెం. చలన చిత్ర పరిశ్రమ వందేళ్ల పాటు గుర్తుంచుకోదగ్గ ఒక చక్కటి ప్రయోగం.

Telugu Kancherapalem, Natural, York Festival, Tollywood-Movie

నిజముగా ఇది ఒక క్లాసిక్ మూవీ.వజ్రాన్ని సానబెడితే వచ్చిన మేలు జాతి చిత్రం.సినిమాలో కనిపించే వారంతా కొత్త వారే.పైగా ఒక ఊరి వాళ్ళను మాత్రమే సినిమాలో తీసుకొని నటింపచేసిన అద్భుతం.ఇలాంటి ఆలోచన వెనక ఆర్థిక కారణాలే ఉంటాయి.ఎవరికి నటన రాదు.

అందులో ఓనమాలు తెలియదు.కేవలం వారి నాచురల్ నటనతో సినిమాను ఆసాంతం గొప్పగా మలిచారు.

ఏ ఒక్కరు పీ.హెచ్.డీ లు వంటివి చేసిన నటులకు సమానమైన వారే.

Telugu Kancherapalem, Natural, York Festival, Tollywood-Movie

చూసేవారికి అది ఒక సినిమా మాత్రమే.మనిషి వందేళ్ల జీవితాన్ని, ఆయా దశల తాలూకు జ్ఞాపకాలను, బాధ్యతలను, గాయాలను, ప్రేమను, భయాలను మర్చిపోకుండా గుండె పొరల్లో ఒడిసి పట్టి సినిమాగా నిక్షిప్తం చేసిన ఒక అద్భుతమైన అనుభవం కేరాఫ్ కంచరపాలెం. క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే ఒక్క వర్డ్ లో మైండ్ బ్లోయింగ్.

సినిమా పూర్తిగా క్రౌడ్ పుల్లింగ్ ఫండ్ తో తీశారు.ఇక ఇప్పటి వరకు న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డ ఏకైక తెలుగు సినిమాగా రికార్డు సృష్టించేంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube