కన్నప్ప మూవీలో ప్రభాస్ రోల్ ఇదే.. శివుడి రోల్ కు అందుకే నో చెప్పారా?

టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) తనయుడు మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే.మంచు విష్ణు ( Manchu Vishnu )ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

 Prabhas Will Be Seen As Nandishwarudu In Manchu Vishnu Kannappa, Kannappa Movie,-TeluguStop.com

ఇకపోతే భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం కూడా తెలిసిందే.గత ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమా శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా మొదలయింది.

శివ పరమ భక్తుడైన కన్నప్ప( Kannappa ) పాత్రలో విష్ణు నటిస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.

Telugu Kannappa, Nandishwarudu, Prabhas, Vishnu-Movie

ఈ హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఇందులో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ప్ర‌భాస్ ఈ సినిమాలో ఏ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌న్న సందేహం అంద‌రిలోనూ ఉంది.ప్ర‌భాస్( Prabhas ) ప‌ర‌మ‌శివుడుగా ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని అనుకొన్నారు.కానీ తాజాగా అందిన సమాచారం ప్ర‌కారం.ఈ సినిమాలో ప్ర‌భాస్ నందీశ్వ‌రుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

Telugu Kannappa, Nandishwarudu, Prabhas, Vishnu-Movie

నిజానికి శివుడి పాత్ర చేయాల‌ని మంచు విష్ణు ఒత్తిడి చేశాడ‌ని, ప్ర‌భాస్ ఆ భారం మోయ‌ద‌ల‌చుకోలేద‌ని, సున్నితంగా ఆ ఆఫ‌ర్ తిర‌స్క‌రించాడ‌ని, చివ‌రికి నందీశ్వ‌రుడిగా ( Nandiswar )క‌నిపించ‌డానికి ఒప్పుకొన్నాడ‌న్న వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.శివుడి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్నాడట.న్యూజీలాండ్ లో ఒక కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకొంది.ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే కన్నప్ప సినిమా షూటింగ్లో పాల్గొన్న బోతున్నారు ప్రభాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube