ప్రభాస్ సింప్లిసిటీనే వేరు.. సాహో టైమ్ షర్ట్ వేసుకున్న ప్రభాస్.. నెట్టింట్లో వైరల్!

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కలిసి నటించిన తాజా చిత్రం సీతారామం. ఈ సినిమాను వై జయంతి సమర్పణలో అశ్వినిదత్ నిర్మించారు.

 Prabhas T Shirt At Sita Ramam Movie Pre Release Event,sita Ramam,prabhas,prabhas-TeluguStop.com

అలాగే ఈ సినిమాలో సుమంత్,గౌతమ్ మీనన్,తరుణ్ భాస్కర్,మురళి శర్మ,వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో నటించారు.కాగా ఈ సినిమా ఆగష్టు 5 న విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డార్లింగ్ ప్రభాస్ హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో ప్రభాస్ స్టైలిష్ కనిపించారు.

ప్రభాస్ ఎంట్రీ తో ఈ ఈవెంట్ మరొక రేంజ్ కి వెళ్ళిపోయింది.

అయితే ఎంతో ఆర్భాటంగా ప్రభాస్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసినప్పటికీ ప్రభాస్ మాత్రం ఎంతో సింపుల్ గా వచ్చేసాడు.కాగా ఈ ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ ధరించిన టీషర్ట్ గురించి ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది.

ప్రభాస్ ధరించిన టీ షర్ట్ ఇంతకుముందే వేసుకున్నాడని తెలుస్తోంది.ప్రభాస్ ఈ ఈవెంట్లో ధరించిన టీ షర్టు ఐదేళ్ల ముందే ధరించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రభాస్ అభిమానులు అప్పటి ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు.ఆ ఫోటోలను చూసిన ప్రభాస్ అభిమానులు డార్లింగ్ ఎంత సింపుల్ గా ఉంటాడో అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

Telugu Baahubali, Pan India, Prabhas, Pre, Saaho, Sita Ramam, Tollywood-Movie

మామూలుగా అయితే హీరోలు వాడిన బట్టలను ఎక్కువగా ఉపయోగించరు.హీరోలు వేల రూపాయలు పెట్టి డిజైన్ చేసిన డిజైనర్ దుస్తులను మాత్రమే ధరిస్తూ ఉంటారు.కానీ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కూడా ప్రభాస్ ఎంతో సింపుల్ గా జీవితాన్ని ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.ఇక అప్పటి ఫోటోలను ఇప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాడు నేడు ప్రభాస్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు.

ఇకపోతే ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube