తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులు వాళ్ళకంటూ ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరో అయిన ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
అయితే సలార్ సినిమా( Salaar ) రీసెంట్ గా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఈ సినిమా తమిళనాడు,( Tamil Nadu ) బెంగళూరు,( Bangalore ) కేరళ( Kerala ) ప్రాంతాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతుందంటూ ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.
రిలీజ్ అయిన ప్రతి చోట ఈ సినిమా కోట్లల్లో వసూళ్లను రాబడుతుంటే ఆ మూడు ప్రాంతాల్లో మాత్రం తమదైన రీతిలో సత్తా చాటులేక పోతుంది అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నిజానికి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాల్సిన సినిమా కానీ ఎందుకు ఈ సినిమా ఆడడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు నిజానికి ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా హైప్ ని క్రియేట్ చేసుకుంది దాంతోనే అక్కడ ప్రి రిలీజ్ బిజినెస్( Pre Release Business ) కూడా భారీగా జరుపుకుంది.ఇక పైన ప్రేక్షకులు ఇలా స్పందించడం పట్ల సినిమా యూనిట్ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఈ సినిమాతో అక్కడ నష్టపోయిన వాళ్ళకి ఈ సినిమా యూనిట్ నష్ట పరిహారాన్ని చెల్లిస్తుందా లేదా అనే విషయం మీద కూడా చాలా వార్తలయితే వస్తున్నాయి.నిజానికి ఈ సినిమా కంటెంట్ అనేది సూపర్ గా ఉంది దాంతో విడుదలైన ప్రతి చోట కూడా మంచి మార్కెట్ ను అయితే ఏర్పాటు చేసుకుంటుంది.అయినప్పటికీ ఈ సినిమా ఎందుకు ఆ భాషల్లో సక్సెస్ కాలేకపోయింది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…
.