తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటులలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో( Salaar ) భారీ హిట్ అందుకున్నాడు.
ఇక అందులో భాగంగానే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకు పైన కలక్షన్లను రాబట్టింది.అయితే ఇప్పుడు ప్రభాస్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ ( Spirit Movie ) అనే సినిమా చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని అభిమానులందరూ కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోషించబోతున్నాడు.
అయితే ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదంటూ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతున్నాడు.ఇక సందీప్ కూడా రీసెంట్ గా అనిమల్ సినిమాతో( Animal Movie ) మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని చేయబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.నిజానికి సందీప్ రెడ్డి వంగా కథల్లో ఒక బోల్డ్ నెస్ అనేది ఉంటుంది.మరి ఈ సినిమాలో కూడా అలాంటి బోల్ట్ క్యారెక్టర్ ని సృష్టించబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.ప్రభాస్ మాత్రం తను దగ్గరుండి ఈ సినిమాకి సంబంధించిన పనులు చూసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

కొన్ని కొన్ని సీన్లలో ప్రభాస్ సందీప్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి నికు నచ్చినట్టు గా రాసేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో సందీప్ రెచ్చిపోయి రాస్తూ స్క్రిప్ట్ ని ఒక కొలిక్కి తీసుకురావాడానికి తన టీమ్ తో కూర్చున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా స్టోరీ( Spirit Movie Story ) మీదనే ఆయన చాలా రోజుల పాటు వర్క్ చేయనున్నట్టు గా తెలుస్తుంది…మారి ఈ సినిమాతో ప్రభాస్ మరో భారీ హిట్ కొట్టబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…