అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా.. పవన్ పై పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్!

అందం, టాలెంట్ ఉన్నా హీరోయిగా పూనమ్ కౌర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే.మాయాజాలం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన పూనమ్ కౌర్ పలు సినిమాలలో సహాయనటి పాత్రలలో నటించి మెప్పించారు.

 Poonam Kaur Comments About Pawan Kalyan Goes Viral In Social Media , Poonam Kaur-TeluguStop.com

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో పూనమ్ కౌర్ బిజీగా ఉన్నారు.పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాతిచరామి త్వరలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా గురించి, పవన్ గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన పూనమ్ కౌర్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ గురించి తాను ఏం మాట్లాడినా వివాదం అవుతుందని పూనమ్ కౌర్ వెల్లడించారు.

తనను కావాలనే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించకుండా చేశారని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ తో తాను చేయలేదని తనను చేయనివ్వలేదని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Bheemla Nayak, Nati Chramai, Pawan Kalyan, Poonam Kaur-Movie

పవన్ కళ్యాణ్ గురించి తాను పాజిటివ్ గా మాట్లాడినా నెగిటివ్ గానే అర్థం చేసుకుంటారని పూనమ్ కౌర్ అన్నారు.ఆ తర్వాత పూనమ్ కౌర్ పవన్ ను తలచుకుంటూ అయ్యయ్యో.నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా అంటూ కామెంట్లు చేశారు.పూనమ్ కౌర్ పవన్ గురించి కామెంట్లు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Telugu Bheemla Nayak, Nati Chramai, Pawan Kalyan, Poonam Kaur-Movie

తన కెరీర్ ను నాశనం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేశారని ఆమె కొన్నిరోజుల క్రితం చెప్పుకొచ్చారు.మానసికంగా తాను ఇబ్బందులను ఎదుర్కొన్నానని పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.పూనమ్ కౌర్ పవన్ గురించి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.నాతిచరామి సినిమాతో పూనమ్ కౌర్ సక్సెస్ ట్రాక్ లో వస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube