అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా.. పవన్ పై పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
అందం, టాలెంట్ ఉన్నా హీరోయిగా పూనమ్ కౌర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే.
మాయాజాలం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన పూనమ్ కౌర్ పలు సినిమాలలో సహాయనటి పాత్రలలో నటించి మెప్పించారు.
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో పూనమ్ కౌర్ బిజీగా ఉన్నారు.
పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాతిచరామి త్వరలో రిలీజ్ కానుంది.ఈ సినిమా గురించి, పవన్ గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన పూనమ్ కౌర్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ గురించి తాను ఏం మాట్లాడినా వివాదం అవుతుందని పూనమ్ కౌర్ వెల్లడించారు.
తనను కావాలనే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించకుండా చేశారని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ తో తాను చేయలేదని తనను చేయనివ్వలేదని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
"""/" /
పవన్ కళ్యాణ్ గురించి తాను పాజిటివ్ గా మాట్లాడినా నెగిటివ్ గానే అర్థం చేసుకుంటారని పూనమ్ కౌర్ అన్నారు.
ఆ తర్వాత పూనమ్ కౌర్ పవన్ ను తలచుకుంటూ అయ్యయ్యో.నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా అంటూ కామెంట్లు చేశారు.
పూనమ్ కౌర్ పవన్ గురించి కామెంట్లు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
"""/" /
తన కెరీర్ ను నాశనం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేశారని ఆమె కొన్నిరోజుల క్రితం చెప్పుకొచ్చారు.
మానసికంగా తాను ఇబ్బందులను ఎదుర్కొన్నానని పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.
పూనమ్ కౌర్ పవన్ గురించి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.నాతిచరామి సినిమాతో పూనమ్ కౌర్ సక్సెస్ ట్రాక్ లో వస్తారేమో చూడాల్సి ఉంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025