ఒక ఊరిలో, రైడ్, వీర, రాక్షసుడు, ఖిలాఢి వంటి తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మ అబ్బయిత్ అనే సినిమాతో త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు.ఈయన తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేతులు కలిపారు.
పూజా బ్యానర్‌పై రమేష్ వర్మ దర్శకత్వంలో ‘హు’ (WHO) అనే భారీ చిత్రం రూపొందనుంది.రీసెంట్‌గా పుష్ప ది రైజ్ చిత్రంలో ‘ఊ అంటావా మావ.
’ అనే సాంగ్‌తో అందరికీ హూషారెక్కించటమే కాకుండా ఎన్నో అద్భుతమైన బాణీలను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నారు.
‘హు’ (WHO) చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయటానికి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.బాలీవుడ్‌లో రీసెంట్‌గా సూపర్ హిట్ అయిన కూలీ నెం.1, జవానీ జానేమన్, బెల్ బాటమ్ వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఘనత పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం.పాండమిక్ సమయంలో షూటింగ్స్ చేయడానికి అందరూ ఆలోచిస్తుంటే పూజా ఎంటర్‌టైన్మెంట్ సంస్థ బెల్ బాటమ్ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసింది.భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యమైన జోనర్స్‌కు సంబంధించిన అద్భుతమైన చిత్రాలను అందించడానికి నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుంది.
ఇప్పటికే అన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.సినిమాలు పైప్ లైన్‌లో ఉన్నాయి.