విశాఖకు బయలుదేరిన టీడీపీ నేత బుద్దా వెంకన్న ను పోలీసులు అడ్డుకున్నారు.విశాఖ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
పోలీసులు, ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.నిరసనగా తన ఇంట్లోనే బుద్దా వెంకన్న దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘నన్ను వైజాగ్ వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు రాతపూర్వకంగా తెలపాలి.నేను విశాఖ వెళ్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కుతారా.చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాము’’ అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.