విజయవాడ పోలీస్ కమిషన్ రేట్ పరిధిలోని నందిగామ సబ్ డివిజన్ లో అక్రమ మద్యం కేసుల్లో సీజ్ చేసిన 5.5 కోట్ల విలువైన 2.5 లక్షల అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.ఇప్పటివరకు 6075 అక్రమ మద్యం కేసులు నమోదు అయినట్లు విజయవాడ సి పి క్రాంతి రానా టాటా వెల్లడించారు.
అక్రమ మద్యం బాటిల్లను పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద వెంచర్ లో ఉంచి రోలర్ల తో ధ్వంసం చేశారు.ఇప్పటివరకు సీజ్ చేసిన మద్యం బాటిల్లలో 90% పైగా తెలంగాణ మద్యం బాటిళ్లు ఉన్నట్లు సిపి తెలిపారు.కోర్టు అనుమతి తీసుకుని ఈ 2.5 లక్షల మద్యం బాటిల్లను ధ్వంసం చేసామని వెల్లడించారు వీటి విలువ 5.5 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని సిపి క్రాంతి రానా టాటా వెల్లడించారు.తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మద్యం తరలించడం నిషేధం ఉన్న కారణంగా అక్రమ మద్యం తరలిస్తున్న వారి వద్ద నుంచి ఈ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని నేడు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.