ఇవాళ హైదరాబాద్ కు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన హాజరుకానున్నారు.

 Pm Modi To Hyderabad Today-TeluguStop.com

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెబుతున్న బీజేపీ ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఈ సభలో బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది మోదీ ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.

అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.కాగా బహిరంగ సభకు బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ కాషాయరంగుతో నిండిపోయాయి.

కాగా సాయంత్రం 5 గంటల సమయంలో మోదీ బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు.అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నారు.

బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్న మోదీ సభ ముగిసిన అనంతరం ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube