భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ( ODI World Cup ) దాదాపుగా చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లన్ని సెమీస్ బెర్త్ కోసం ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి.
నేడు ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్( Australia vs Afghanistan ) మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.ఇరుజట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఉండడంతో చివరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.ఒకవేళ ఆస్ట్రేలియా ఓడితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు మరింత మెరుగు అవుతాయి.
ఆస్ట్రేలియా జట్టు( Australia Team ) టోర్నీ ఆరంభంలో వరుస రెండు మ్యాచ్లలో ఓటమిని చవిచూసి, ఆ తర్వాత వరుస ఐదు మ్యాచ్లలో విజయం సాధించి పది పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది.ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
నేడు ఆఫ్ఘనిస్తాన్ తో, నవంబర్ 11న బంగ్లాదేశ్ తో తలపడనుంది.ఈ రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ లో గెలిచినా కూడా ఆసీస్ సెమీస్ చేరుతుంది.

కాబట్టి నేడు జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై( Afghanistan ) గెలిచి ఆస్ట్రేలియా సెమీస్ బర్త్ ఖరారు చేసుకోవాలని భావిస్తోంది.నేటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై గెలవాలంటే ఆసీస్ మిడిల్ ఆర్డర్ అద్భుత ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది.ఇక ఆఫ్గనిస్తాన్ జట్టు విషయానికి వస్తే.పసికూన జట్టుగా టోర్నీలోకి అడుగుపెట్టి పెద్ద జట్లను సైతం ఆఫ్ఘనిస్తాన్ ఆశ్చర్యపరిచింది.ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో గెలిచి, ఎనిమిది పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు కు సెమీస్ చేస్తే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.అయితే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఒక జట్టుపై గెలిస్తే.సెమీస్ చేరే అవకాశాలు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం.కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువగా అంచనా వేయలేం.
నేడు జరిగే మ్యాచ్ తర్వాత సెమీస్ చేరే జట్ల విషయంలో కాస్త స్పష్టత రానుంది.







