పి.కె.ఎన్ క్రియేషన్ బ్యానర్‌పై.కెఎస్ నాయక్ దర్శకత్వంలో మాస్టర్ శశాంత్, మరో ఇద్దరు చిన్నారులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోయే ఏనుగు పోయే’.
పవనమ్మాళ్ కేశవన్ నిర్మించిన ఈ చిత్రంలో ఏనుగు కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 1న నిర్వహించబోతున్నట్లుగా నిర్మాత తెలియజేశారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.
‘‘ఒక ఏనుగును చిన్న పిల్లలు ఎలా కాపాడారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించాడు.
విలన్‌కు ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది.
ఆ నిధి దక్కాలంటే ఒక ఏనుగు పిల్లను బలివ్వాలని ఒక మంత్రగాడు చెబుతాడు.ఒక ఏనుగుల వేటగాడిని కలిసి.
ఏనుగును సొంతం చేసుకున్న విలన్ నుంచి.ఆ ఏనుగుల వేటగాడి కుమారుడు ఏనుగు ఎలా తప్పించాడు? అనేదే చిత్ర మెయిన్ కథాంశం.ఇందులో బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 1న చిత్ర ఆడియోని విడుదల చేసి.ఆ వెనువెంటనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము.’’ అని తెలిపారు.
మాస్టర్ శశాంత్, బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి డిఓపి: అశోక్ రెడ్డి, మ్యూజిక్: భీమ్స్, లిరిక్స్: శ్రీ రాగ్, డాన్స్: రిక్కీ మాస్టర్, కథ- స్క్రీన్ ప్లే: అరవింద్ కేశవన్, పీఆర్వో: బి.వీరబాబు, కో ప్రొడ్యూసర్: లత, నిర్మాత: పవనమ్మాళ్ కేశవన్, డైరెక్టర్: కె ఎస్.నాయక్.