లాయర్ సాహెబ్ గా సందడి చేయబోతున్న బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటివరకు తన కెరియర్ లో ఎక్కువగా కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు.బాలకృష్ణ సినిమా అంటే భారీ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ తెలియకుండానే ఆశిస్తుంటారు.

 Pink Movie Remake With Balakrishna-TeluguStop.com

బాలకృష్ణ కూడా ఫ్యాన్స్ ఇష్టానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు.టాలీవుడ్ లో ప్రస్తుతం డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాత ఎవరైనా అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ఊహించని విధంగా తన బాడీ లాంగ్వేజ్ కి సంబంధంలేని చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటించిన పింక్ సినిమాని తెలుగులో బాలకృష్ణ టైటిల్ రోల్ లో పెట్టి తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా సొంతం చేసుకొని టైటిల్ కూడా లాయర్ సాహెబ్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం.ఈ సినిమాలో బాలకృష్ణ వయస్సు మళ్ళిన సీనియర్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా బాలకృష్ణ చేస్తాడనే టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంటెంట్ పరంగా సినిమా బాగున్న బాలయ్య నుంచి కోరుకునే అంశాలు ఇందులో ఉండే అవకాశం లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి నందమూరి ఫాన్స్ ని సంతృప్తి పరచడం కోసం దిల్ రాజు ఈ సినిమాలో ఏవైనా మార్పులు చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube