Sam Bahadur : గొప్ప వీరుడి బయోపిక్‌ను రిజెక్ట్ చేసిన యువత.. దర్టీ బుర్రలకు యానిమల్స్ తప్ప ఇంకేం నచ్చుతాయి?

మహాత్మా గాంధీ అని టైటిల్ పెట్టి తీస్తే సినిమా ఒక్కరోజు కూడా ఆడదు, అదే ఏ స్మగ్లర్ గురించో లేదా వీరప్పన్ లాంటి క్రూరమైన వ్యక్తి గురించో తీస్తే అది సూపర్ హిట్ అవుతుంది.ఇక బీభత్సమైన బోల్డ్, వల్గర్ సినిమాలు తీసినా వాటిని సూపర్ హిట్స్‌ చేయడంలో నేటి యువత ముందుంటున్నారు.

 People Are Rejected Great Biopics-TeluguStop.com

దేశానికి మంచి చేసిన వారి గురించి తెలుసుకోండి అయ్యా అని ఎంతో శ్రద్ధతో బయోపిక్ తీసి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నా వాటిని పట్టించుకునే నాథుడే ఈ రోజుల్లో కనిపించడం లేదు.ఉదాహరణకు రీసెంట్‌గా బోల్డ్, ఇన్‌టెన్స్ సీన్లతో కూడిన యానిమల్ సినిమా రిలీజ్ అయింది.

ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే “శాం బహదూర్( Sam Bahadur )” రిలీజ్ అయ్యింది.ఇండియన్ ఆర్మీకి విశేష సేవలు అందించిన నేషనల్ హీరో మానెక్‌ షా బయోపిక్ ఇది. ఫీల్డ్‌ మార్షల్‌ ( Field Marshal ) మానెక్‌ షా ధైర్య సాహసాలతో చేసిన యుద్ధం వల్లనే పాకిస్థాన్‌లో బెంగాలీల మీద జరుగుతున్న హింస అయిపోయింది.దాని తర్వాత పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడ్డది.

Telugu Animal, Bio, Bollywood, Pakistan, Sham Bahadur, Tollywood, Vicky Kaushal-

షా 40 దశాబ్దాలలో మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొని ఇండియాకు ఒక వెన్నుముకగా నిలిచాడు.ఇందిరా గాంధీ చెప్పిన మాట వినకుండా తన అనుభవంతో, అద్భుతమైన విశ్లేషణతో తాననుకున్న రోజే పాకిస్థాన్( Pakistan ) తో యుద్ధం చేసి భారతదేశాన్ని గెలిపించాడు.ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటినీ సహిస్తూ చివరికి రియల్ హీరోగా అవతరించాడు.అలాంటి గొప్ప హీరో సినిమాకు యానిమల్ వంటి చెత్త సినిమాల కంటే తక్కువ రెస్పాన్స్ రావడం నిజంగా బాధాకరం.

ఇంతటి గొప్ప వీరుడి కథకు కావాల్సిన ప్రచారాన్ని మీడియా గానీ ప్రేక్షకులు గానీ అస్సలు ఇవ్వడం లేదు.

Telugu Animal, Bio, Bollywood, Pakistan, Sham Bahadur, Tollywood, Vicky Kaushal-

యువత ఈ సినిమాని రిజెక్ట్ చేసినా, ఈ గొప్ప వీరుడి గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్న చాలామంది పెద్దవారు, నడివయస్కులు ఈ మూవీకి క్యూ కడుతున్నారు.దానివల్ల 15 రోజుల్లో దాదాపు రూ.100 కోట్ల దాకా డబ్బులు వసూలు చేయగలిగింది.దీనిని చక్కగా ప్రచారం చేసి ఉంటే యానిమల్ మూవీకి సమానంగా కలెక్షన్లను రాబట్టి ఉండేది.ఈ మూవీ ఒక్క హిందీ భాషలోనే రిలీజ్ అయింది.ఒకవేళ తెలుగు తమిళం కన్నడ వంటి భాషల్లో కూడా రిలీజ్ అయి ఉంటే కలెక్షన్లు ఇంకా ఎక్కువగా వచ్చుండేవి.ఈ బయోగ్రాఫికల్ వార్ డ్రామాని మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేసింది.

విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించాడు.ఈ సినిమా బడ్జెట్ రూ.55 కోట్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube