Pawan Kalyan : పిఠాపురం పై పవన్ ఫోకస్ .. పర్యటన ఎప్పుడంటే ? 

టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆ నియోజకవర్గంలో తన గెలుపు అవకాశాలను మరింత మెరుగు పరుచుకునే పనికి శ్రీకారం చుట్టారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక,  భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి చెందడం తో పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు.అయితే ఈసారి బిజెపి, జనసేన కలిసి పోటీ చేయబోతున్న  పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం వంటివన్నీ లెక్కలు వేసుకుని ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.

 Pawans Focus On Pithapuram When Is The Trip-TeluguStop.com
Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Pitapuram, Vanga Geetha-Politics

ఇక్కడ టిడిపి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ( Former MLA Verma ) రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమైనా టిడిపి అధినేత చంద్రబాబు ఆయనను బుజ్జగించి ఎమ్మెల్సీ ఇస్తామని హామీని ఇవ్వడంతో ఆయన పవన్ విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు.ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా,  భారీ మెజారిటీతో విజయం సాధించే విధంగా,  క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకునే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.  దీనిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) ఎన్నికల ప్రచారానికి దిగేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వచ్చే వారంలో పిఠాపురం.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Pitapuram, Vanga Geetha-Politics

నియోజకవర్గంలో పర్యటించే విధంగా షెడ్యూల్ ను రూపొందించుకుంటున్నారు .వైసిపి అభ్యర్థిగా మాజీమంత్రి వంగ గీత( Former Minister Vanga Geeta ) పోటీ చేయబోతుండడం,  ఈ నియోజకవర్గంలో ఆమెకు విస్తృతంగా పరిచయాలు ఉండడం,  కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఇవన్నీ లెక్కలు వేసుకుని పవన్ ఈ నియోజకవర్గంలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇప్పటికే కొంతమంది కీలక నేతలకు ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలను పెంచే బాధ్యతను అప్పగించారు.

ఇప్పటికే జనసేన శ్రేణులు విస్తృతంగా జనాల్లోకి వెళుతూ పవన్ విజయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నారు.పవన్ కూడా ఈ నియోజకవర్గంలో విడతల వారీగా ఎన్నికల ప్రచారం  నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube