విదేశీ పర్యటనకు పవన్ ! మరి వారాహి యాత్ర ?

త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కుటుంబ సమేతంగా విదేశీ టూర్ కి వెళ్ళనున్నారు.ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి .

 Pawan On A Foreign Trip! And Varahi Yatra , Pavan Kalyan, Telugudesam Tdp,va-TeluguStop.com

టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది .ఇదే సమయంలో జనసేన , టిడిపిల మధ్య పొత్తు కుదిరింది.అలాగే ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు స్వయంగా పవన్ ప్రకటన చేశారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి.ప్రస్తుతం కృష్ణాజిల్లా నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టిన పవన్ దానికి బ్రేక్ ఇచ్చారు.  ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళుతుండడంతో ,  వారాహి యాత్రకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సమయంలో పవన్ విదేశీ టు కు వెళ్లడానికి కారణం ఏమిటనేది అందరికీ ఆసకకరంగా మారింది.

Telugu Chandrababu, Varun Tej, Janasenani, Pavan Kalyan, Telugudesam Tdp, Varahi

 పవన్ విదేశీ టూర్ కి వెళ్లడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది .తన కుటుంబంలో జరగనున్న వెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు పవన్ విదేశాలకు వెళ్తున్నారు.  త్వరలోనే సోదరుడు నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ ,( Varun Tej ) హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya tripathi ) పెళ్లి చేసుకానున్నారు.

ఈ పెళ్లి తంతు ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేసింది.ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో చాలామంది ఇటలీ కి చేరుకున్నారు .అక్కడ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో నిమగ్నమయ్యారు.కుటుంబ సమేతంగా పవన్  నేపథ్యంలో వారాహి యాత్ర( Varahi Yatra )కు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారు.

అయితే పార్టీ పరంగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన తర్వాతే పవన్ విదేశీయులకు వెళ్లనున్నారట.అక్టోబర్ 1 నుంచి ప్రారంభించిన నాలుగో విడత వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ,  మచిలీపట్నం,  కైకలూరు , పెడన నియోజకవర్గాల్లో నిర్వహించారు . ఈ యాత్రకు అక్టోబర్ ఐదు నుంచి బ్రేక్ పడింది .

Telugu Chandrababu, Varun Tej, Janasenani, Pavan Kalyan, Telugudesam Tdp, Varahi

అప్పటి నుంచి పవన్ పార్టీ ( Pawan’s party )నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈనెల 12 నుంచి 17 వరకు పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు,  వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ లోపులో చంద్రబాబుకు బెయిల్ లభిస్తే ఆయనతో ప్రత్యేకంగా పవన్ భేటీ కానున్నారు.

ఇక తెలంగాణ ఎన్నికల్లోను 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఇటీవల పవన్ ప్రకటించారు .దీంతో టిక్కెట్లు కేటాయింపు , బీజేపీతో పొత్తు , టిడిపి తో పొత్తు వంటి అంశాల పైన పార్టీ నాయకులతో పవన్ చర్చించనున్నారట.ఈనెల 17 వరకు పవన్ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టుకుని అనంతరం వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వేడుకకు హాజరై, ఆ తంతు మూసిన అనంతరం ఈనెల 26న పవన్ తిరిగి స్వదేశానికి రానున్నట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube