Janasena Leader Pawan Kalyan : ఈనెల 14 నుంచి ఉభయగోదావరి జిల్లాలలో పవన్ పర్యటన ఖరారు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan kalyan ) ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.2019 ఎన్నికలలో మొదటిసారి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమిపాలయ్యారు.ఈ క్రమంలో 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా రాజకీయం నడుపుతున్నారు.ఇదే సమయంలో వైసీపీ( YCP ) అధికారంలోకి రాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.

 Janasena Leader Pawan Kalyan : ఈనెల 14 నుంచి ఉభయగో-TeluguStop.com

దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు( TDP )/em> పెట్టుకోవడం జరిగింది.కాగా ఎన్నికలకు ఇంకా 60 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఉభయగోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి పర్యటనలకు రెడీ కావడం జరిగింది.

ఈనెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు.

అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించనున్నారు.ఇక ఇదే సమయంలో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పర్యటనలో బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నట్లు సమాచారం.ఆల్రెడీ బీజేపీకి జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తూ ఉంది.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది.కానీ తెలుగుదేశం.

బీజేపీ పార్టీల పొత్తు ఇంకా కన్ఫామ్ కాలేదు.ఈ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటన( Pawan Kalyan Delhi Tour ) తర్వాత…టీడీపీ-జనసేన-బీజేపీ( TDP Janasena BJP ) పొత్తుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ పొత్తు కన్ఫర్మ్ అయితే 2014 ఎన్నికల మాదిరిగా కూటమి ఏర్పడినట్లు అవుద్ది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube