పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ #PawanKalyan టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Sujeeth ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”;r #OG .పవర్ స్టార్ లైనప్ లో అన్నిటి కంటే చివరిగా ప్రకటించిన కూడా అన్ని ప్రాజెక్ట్స్ కంటే ముందుగానే పవన్ దీనిని పూర్తి చేస్తున్నాడు.
పవన్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెట్టడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ప్రకటించి ఎంతో కాలం గడవలేదు.
అలా ప్రకటించగానే ఇలా స్టార్ట్ చేసి అప్పుడే సగం షూట్ పూర్తి చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.ఇటీవలే ముంబైలో మూడవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు.
ఇక ప్రజెంట్ పవన్( Pawan kalyan ) వారాహి యాత్రలో ఉండడంతో ఈ సినిమా స్వల్పంగా వాయిదా పడింది.మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమా పవన్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచి పోతుందని అంటున్నారు.ఇక పవన్ ను సుజీత్ చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేయబోతున్నాడట.అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ సిక్స్ ప్యాక్ #SixPack లో కనిపించబోతున్నాడట.అందుకోసం ఈయన ప్రత్యేకంగా వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేయనున్నారట.
వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) రెండవ విడత పూర్తి అవ్వగానే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుందని అప్పటికి ఈయన సిక్స్ ప్యాక్ లో రెడీ అవుతాడని అంటున్నారు.ఇంకా పవన్ ఈ సినిమా కోసం 30 రోజుల డేట్స్ ఇస్తే ఈ #OG మూవీ షూట్ పూర్తి అవుతుందని టాక్.అందుకే ఫాస్ట్ గా షూట్ పూర్తి అయితే ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకోవచ్చు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ #PriyankaMohan హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ #Thaman సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.మరి సుజీత్ తెరకెక్కిస్తున్న #OG ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.