'ఓజి' ఫస్ట్ లుక్ ఆ రోజే.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు వారాహి యాత్రలో( Varahi Yatra ) బిజీగా ఉండడంతో షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు.దీంతో ఈయన లైనప్ లో ఉన్న సినిమాలన్నీ షూటింగులు ఆగిపోయాయి.

 Pawan Kalyan Sujeeth Og Update, Director Sujeeth, Og Movie, Pawan Kalyan, Thaman-TeluguStop.com

మరి పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఓజి ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujith ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”( OG ).

Telugu Sujeeth, Og, Og Teaser, Pawan Kalyan, Pawankalyan, Priyanka Mohan, Thaman

ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.ఇక మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పవన్ ( Pawan Kalyan )ఈ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఫాస్ట్ గా పూర్తి చేయడంతో ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై అంచనాలు భారీ సుతఃయిలో పెంచుకున్నారు.ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుండడంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్( OG Movie First Look ) కు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ కాగా దీని ప్రకారం ఈ మూవీ ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అలాగే ఈ భారీ సినిమా టీజర్ ను పవన్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

Telugu Sujeeth, Og, Og Teaser, Pawan Kalyan, Pawankalyan, Priyanka Mohan, Thaman

మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.

డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube