Modi Pawan Kalyan : విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంకి చేరుకున్నారు.ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా విశాఖ విమానశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు.అనంతరం పవన్ కళ్యాణ్.వాహనంలో నేరుగా నోవాటెల్ హోటల్ కి బయలుదేరడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధాని మోడీతో రాష్ట్ర రాజకీయాలు ఇంకా అనేక విషయాలకు సంబంధించి దాదాపు 5 పేజీల నోట్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

 Pawan Kalyan Reached Vishakapatnam , Modi, Pawan Kalyan, Vishakapatnam-TeluguStop.com

ప్రధానంగా ఈ భేటీలో బిజెపితో పొత్తుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.2014 ఎన్నికల సమయంలో మోడీతో కలిసి పవన్ ప్రచారంలో పాల్గొన్నారు.ఆ సమయంలో మోడీ గెలిచిన తర్వాత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది.అప్పటినుండి ఇద్దరు ఎప్పుడూ కూడా భేటీ కాలేదు.అయితే చాలా కాలం తర్వాత మోడీతో ఇప్పుడు పవన్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube