వెంకటేశ్ నటించిన వరస 8 హిట్ సినిమాల మధ్య ఏకైక యావరేజ్ సినిమా ఇదే..!

వెంకటేష్ ఇప్పుడు అంటే ఏడాది కి లేదా రెండేళ్లకు ఒక సినిమా తీస్తున్నాడు కానీ ఒక పదిహేనేళ్ళు వెనక్కి వెళ్తే ప్రతి ఏటా 2 నుంచి మూడు సినిమాలు నటించి విడుదల అయ్యేవి.2000 సంవత్సరానికి ముందు వరకు వెంకటేష్ ది ఒక గోల్డెన్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు.వరసగా విజయాలు అందుకున్న వెంకటేష్ విక్టరీ అనే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.ఇక అలాంటి వరస సినిమాలు ఘన విజయం సాధిస్తున్న రోజులవి.1997 నుంచి 2001 వరకు వెంకటేష్ నటించిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి.కానీ ఒకే ఒక్క సినిమా యావరేజ్ గా నిలిచి వెంకటేష్ విజయాలకు బ్రేక్ వేసింది.

 Venkatesh Average Movie In 8 Hits , Suryavansam, Ganesh, Venkatesh, Raja, Srinu-TeluguStop.com

అదే రాజా వంటి హిట్ సినిమా తర్వాత వచ్చిన శీను సినిమా.ఈ సినిమా 1999 లో విడుదలై మాములుగా సినిమాగా మిగిలిపోయింది.అప్పటి వరకు ప్రేమించుకుందాంరా, సూర్యవంశం , గణేష్, పెళ్ళి చేసుకుందాం, ప్రేమంటే ఇదేరా, రాజా వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యి రాజాకు తిరుగులేదు అని అనిపించుకున్నాడు.ఇక శీను సినిమా తర్వాత సైతం జయం మనదేరా, కలిసుందాం రా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

ఇలా ఇన్ని వరస హిట్స్ మధ్య ఒకే ఒక్క యావరేజ్ సినిమా శీను.అయితే ఈ సినిమా యావరేజ్ సినిమా అయితే ఇంత సేపు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది.వాస్తవానికి శీను సినిమా చాల మంచి సినిమా.

Telugu Shashi, Ganesh, Jayam Manadera, Kalisundham Ra, Raja, Seenu, Srinu, Surya

కేవలం ఒకటి రెండు మైనస్ పాయింట్స్ మాత్రమే ఈ సినిమా యావరేజ్ క్యాటగిరి లో పడింది.అందులో ముఖ్యంగా క్లైమాక్స్ లో నాలుక కోసుకోవడం మన తెలుగు ఆడియెన్స్ కి నచ్చలేదు.ఇక మన టాలీవుడ్ ప్రేక్షకులకు సాడ్ ఎండింగ్ నచ్చవు.

ఎప్పుడు హ్యాపీ ఎండింగ్స్ మాత్రమే కావలి .అందుకే ఈ సినిమా హిట్ అవలేదు అని అనుకోవచ్చు.ఈ సినిమా ని తీసిన దర్శకుడు శశి తెలుగు లో కన్నా తమిళ్ లో మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన మణి శర్మ ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.

ఈ సినిమాలోని అన్ని పాటలు ఎంతో అద్భుతం గా ఉంటాయి.ఇప్పటి ఆ సినిమాలోని పాటలు చాల ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube