విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.ప్రధాని బసచేసిన ఐఎన్ఎస్ చోళ హోటల్ లో ఇరువురి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు చర్చ జరిగింది.
ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనడం జరిగింది.అయితే భేటీ అనంతరం హోటల్ వెలుపల మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.ప్రధాని మోడీని ఎనిమిది సంవత్సరాల తర్వాత కలవడం జరిగిందని తెలిపారు.
రెండు రోజుల కిందట పిఎంఓ ఆఫీస్ నుంచి తనకి పిలుపు వచ్చిందని పేర్కొన్నారు.2014.లో గెలిచిన తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయనను కలవడం జరిగింది.ఆ తర్వాత చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినా గాని ప్రధానిని కలవలేదని అన్నారు.అయితే దాదాపు 8 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు కలవడం జరిగిందని పేర్కొన్నారు.ఈరోజు చాలా ప్రత్యేక పరిస్థితులలో ప్రధానిని కలవడం జరిగింది.
ఈ భేటీ ముఖ్య ఉద్దేశం.ప్రధాని యొక్క ఆకాంక్ష.
ఆంధ్రప్రదేశ్ బాగుండాలి.ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి చెందాలి.
తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి వర్ధిల్లాలి.
ఈ సమావేశంలో అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదే సమయంలో నాకు అవగాహన ఉన్నంతవరకు అన్ని విషయాలు ప్రధాని దృష్టికి తీసుకు వచ్చాను.ప్రధానితో సమావేశం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు తీసుకొస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని .ప్రధాని మోడీతో భేటీ తర్వాత మీడియా సముఖంగా పవన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.