జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీచేసినా, జనసేనకు కేవలం ఒకే ఒక్క స్థానం.దక్కింది.జనసేనకు బలమున్న నియోజకవర్గాలతో పాటు , అసలు ఏమాత్రం ప్రభావం లేని నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఆ స్థాయిలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది దీంతో ఈసారి అటువంటి తప్పిదం చేయకూడదనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు.అందుకే ముందుగా బలం ఉన్న నియోజకవర్గాలు ఏమిటి అనే విషయంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు.2024 ఎన్నికల్లో పూర్తిస్థాయిలో తమకు బలం ఉందనుకున్న నియోజకవర్గంలో పోటీకి దిగి, తమకు బలం లేని ప్రాంతాలను వదిలిపెట్టేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారట. దీని ద్వారా బలమున్న నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రచారం చేసుకునేందుకు వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించేందుకు అవకాశం ఏర్పడుతుందనేది పవన్ అభిప్రాయం.
ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పై పవన్ పూర్తిగా ఫోకస్ పెట్టారు.
ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేనకు బలమైన కేడర్ ఉండడంతో పాటు, సొంత సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం ఇవన్నీ కలిసి వస్తాయనే లెక్కల్లో పవన్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలలోను పోటీ చేయడం ద్వారా, టిడిపి , జనసేన ఓట్లు భారీగా చీలి వైసిపి 14 స్థానాల్లో విజయం దక్కించుకోగలిగింది .మిగతా 4 స్థానాల్లో టిడిపి, ఒక్క స్థానంలో జనసేన గెలిచింది.రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో రాజోలు ఒక్కటి మాత్రమే గెలవడం, స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి చెందడంతో ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు.
కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ గా జనసేన ను మార్చాలని వ్యూహంతో పవన్ ఉన్నారు.

తూర్పుగోదావరిలోని పెద్దాపురం, పత్తిపాడు , మండపేట , జగ్గంపేట , రాజోలు, పిఠాపురం, ముమ్మిడివరం , గన్నవరం, అమలాపురం, రామచంద్రపురం తో పాటు, రాజమండ్రి సిటీ, రూరల్ , కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని , వీటిలో కాకినాడ రూరల్ , పిఠాపురం , రాజోలు, రాజమండ్రి రూరల్ స్థానాల్లో జనసేన తప్పకుండా గెలుస్తుందనే సర్వే నివేదికలు పవన్ కు చేరడంతో ప్రత్యేకంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి పై పవన్ ఫోకస్ పెట్టినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.