వాలంటీర్ల పై పవన్ వ్యాఖ్యలు సెల్ఫ్ గోలేనా?

తన మొదటి దశ వారాహి యాత్ర( Varahi yatra ) తో సూపర్ సక్సెస్ కొట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెట్టించిన ఉత్సవంతో వారాహి మలి విడత యాత్రకు శ్రీకారం చుట్టారు.మొదటి దశ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలపై కేవలం మాటలతో సరిపెట్టిన పవన్ రెండవ దశ యాత్రలో అంకెల చిట్టాలను కూడా విప్పారు .

 Pavan Self Goal Towards Volunteers?, Pawan Kalyan, Jana Sena, Vasireddy Padma ,-TeluguStop.com

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వైఫల్యం పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన రిపోర్ట్ ని పాయింట్ టు పాయింట్ ప్రజలకు అర్థవంతమైన భాషలో వివరిస్తూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.ఇంతవరకు బాగానే ఉన్నా తన స్పీచ్లో వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ కళ్యాణ్( Pawan kalyan ) చేసిన కొన్ని విమర్శలు ఇప్పుడు భూమరాంగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

అదికార పార్టీ తమ రాజకీయ ప్రయోజనం కోసమే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ దాదాపు రెండు లక్షల ఎనభై వేల సంఖ్య ఉన్న వాలంటీర్ల వ్యవస్థ పై విమర్శలు ఒక పార్టీగా జనసేనకు ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.

Telugu Ap, Eluru, Jana Sena, Pawan Kalyan, Vasi Padma, Volunteers-Telugu Politic

ప్రత్యక్షంగా ఈ సంఖ్య రెండు లక్షల చిల్లర అయినప్పటికీ వీరి కుటుంబ సభ్యులను వీరిపై ఆధారపడే బంధుమిత్రులను లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య పది లక్షలు దాటుతుంది.మరి అంత పెద్ద సంఖ్యాపరమైన ఓటింగ్ను తన ఒక్క స్పీచ్ ద్వారా జనసేన దూరం చేసుకున్నట్లు అయింది.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న అధికార పార్టీ వాలంటీర్లతో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ పవన్ పై తీవ్ర స్థాయిలో ఎదురుచేస్తుంది.

Telugu Ap, Eluru, Jana Sena, Pawan Kalyan, Vasi Padma, Volunteers-Telugu Politic

ఇది ఒక రకంగా సెల్ఫ్ గోలనే చె.ప్పాలి మరి పవన్కళ్యాణ్ కి అందిన ఫీడ్బ్యాక్ ఏమిటో తెలియదు కానీ, కనీసం వాలంటీర్లలో ( volunteers ) ఒక వర్గం ఇలా చేస్తుంది అని విమర్శించి ఉన్నా ఇంత ప్రతిఘటన వచ్చి ఉండేది కాదు.మొత్తం వాలంటీర్ వ్యవస్థని అవమానించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని సామాన్య జనంలో కూడా ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చింది .మరి తన తరువాతి స్పీచ్ లోనైనా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను సరి చేసుకుంటారని ఆశిద్దాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube