దూకుడే తారక మంత్రం అంటున్న పవన్ !

నిజానికి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను పార్టీలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి.ఒకవేళ వ్యతిరేక స్పందన వస్తే మాత్రం తమ ప్రయత్నాన్ని విరమించుకోవటం లేదా సరి చేసుకోవడం చేస్తూ ఉంటాయి .

 Pavan Believes Aggresseve Politics, Pawan Kalyan, Ap Politics , 2024 Elections,-TeluguStop.com

మరి ఇంకా అధికారం దిశగా బుడిబుడి అడుగులు వేస్తున్న జనసేన లాంటి పార్టీలు ప్రజా స్పందన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.కానీ తను అనుకున్న విషయాల్లో దూకుడుగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న వ్యతిరేకతను కూడా లెక్క చేయకపోవడం పార్టీకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో కూడా తెలియని ఒక అయోమయ స్థితిలో జనసేన( Jana sena ) పొలిటికల్ వ్యూహా నిపుణులు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి .నిజానికి వాలంటీర్ వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు సహజంగా ఏ రాజకీయ నాయకుడు చేయడానికి ధైర్యం చేయలేనిది.వాలంటరీ వ్యవస్థలో లోపాలు ఉండడం , సరైన నియంత్రణ లేకపోవడం , అదికార పార్టీ కి మాత్రమే అనుకూలం గా ఉండడం అన్నది బాహాటం గా అందరు ఒప్పుకుంటున్నప్పటికీ అంత ధైర్యంగా బలమైన సంఖ్యాపరమైన వ్యవస్థపై అంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చేయలేదు.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Varahi Yatra-Telugu Political

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ( TDP ) ఒకసారి అలాంటి ప్రయత్నం చేసినా ప్రతిస్పందనను చూసి మళ్లీ ఆ జోలికి పోలేదు.అయితే వరుస పెట్టి ఇన్ని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నా కూడా తాను వెనక్కి తగ్గనని ఎక్కడ ఎంతవరకైనా సిద్ధమే అంటూ ముందుకు వెళుతున్న వైనం చూస్తే పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తెగింపు వెనుక ఉన్న ధైర్యం ఏమిటో అన్నది అంతు పట్టని ప్రశ్నగా మారింది.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Varahi Yatra-Telugu Political

అయితే అధికారం కన్నా ప్రజాసే తనకు ముఖ్యమని పార్టీ పెట్టినప్పుడే ప్రకటించిన పవన్, జరుగుతున్న అన్యాయాలపై ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా, నిజాయితీగా ఉండబట్టే ఈ రకంగా మాట్లాడగలుగుతున్నాడని ,అతని అంతిమ లక్ష్యం రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందటమే తప్ప అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, లేకపోతే జరుగుతున్న అన్యాయాన్ని చూసి కళ్ళు మూసుకుని వెళ్లిపోవటమో కాదని, అతను సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా నిజాయితీ గలిగిన లీడర్ గా ప్రవర్తిస్తున్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు .మరి దూకుడే తారక మంత్రం అంటున్న జనసేన అధ్యక్షుడు మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube