గడిచిన మూడు దశాబ్ధాలుగా అమెరికాలోని హోటల్, మోటెల్ పరిశ్రమకు పర్యాయపదాలుగా ‘‘పటేల్’’( Patel ) సామాజికవర్గం నిలిచిందని భారతీయ అమెరికన్ పుస్తక రచయిత మహేంద్ర కె దోషి( Mahendra K Doshi ) జాతీయ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.పటేల్ వర్గం అమెరికన్ హాస్పిటాలిటీ ల్యాండ్ స్కేప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని .
ఫెడరల్ ప్రభుత్వ నిబంధలను వారు అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారని దోషి అన్నారు.అమెరికాలో( America ) పటేల్ వర్గం ఎదుగుదల , సాధించిన విజయాలను తన “Surat to San Francisco” పుస్తకంలో మహేంద్ర ప్రస్తావించారు.
కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ పుస్తకం.అమెరికాలో మోటెల్ పరిశ్రమలో( Motels ) పటేళ్ల కథకు సంబంధించి మొట్టమొదటి డాక్యుమెంటేషన్ .ఎంతోమంది పటేళ్లను ఇంటర్వ్యూ చేసి ఆయన దీనిని రూపొందించారు.

సౌరాష్ట్రలోని వాడియాలో పుట్టి కోల్‌కతాలో పెరిగిన దోషి. ‘‘ఇండియా అబ్రాడ్ ’’ ( India Abroad ) అనే పబ్లికేషన్ సంస్థలో మాజీ పాత్రికేయుడు.ఆయన రాసిన ఈ పుస్తకం ఆధారంగా ఓ సినిమాను సైతం తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుత తరం తమ పూర్వీకుల కష్టాలను చూడలేదని.అందువల్ల అమెరికన్ ఇమ్మిగ్రెంట్ సక్సెస్ స్టోరీలో ఈ భాగాన్ని తీసుకురావడం తన బాధ్యత అని దోషి అన్నారు.
ఇది నిజంగా అమెరికన్ వలసదారుల విజయగాథగా ఆయన అభివర్ణించారు.భారీ ఎత్తున ఉపాధి, భారీ సంపద వున్న పరిశ్రమను వారు నిర్మించారని మహేంద్ర ప్రశంసించారు.
ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ‘‘ ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ’’ (ఏఏహెచ్ఓఏ)( Asian American Hotel Owners Association ) వార్షిక సమావేశం సందర్భంగా దోషి పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

1989లో స్థాపించబడిన ఏఏహెచ్ఓఏ 36 వేలకు పైగా సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తూ… 1.1 మిలియన్ల మంది కార్మికులను నియమించింది.యూఎస్ జీడీపీకి 1.5 శాతానికి పైగా ఈ పరిశ్రమ సహకారం అందిస్తోంది.వీరి వార్షిక వ్యయం 50 బిలియన్ డాలర్ల పైనే వుంది.
పటేల్స్ 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి వున్నారని దోషి చెప్పారు.ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో నివసిస్తున్న దోషి తన జీవితంలో 165 మంది పటేళ్లను ఇంటర్వ్యూ చేశారు.1920వ దశకంలో పటేళ్లు అమెరికాకు వలస రావడం మొదలైందని.ఆ సమయంలో ఆసియన్లను అమెరికా అనుమతించకపోవడంతో వారు ట్రినిడాడ్, హోండూరాస్, పనామా ద్వారా అక్రమంగా అమెరికాలో ప్రవేశించారని మహేంద్ర పేర్కొన్నారు.