వరి పంటకు చీడపీడలు ఆశించకుండా ముందస్తుగా పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు..!

రైతులు ఏ పంటను సాగు చేసినా అధిక దిగుబడులు సాధించాలంటే.చీడపీడలు లేదంటే తెగులు( Pests ) పంటను ఆశించిన తర్వాత సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు తీసుకోవడం కంటే చీడపీడలు లేదంటే తెగుళ్లు పంటను ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడి వ్యయంతో ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

 Pests Management In Paddy Crop Details, Pests Management ,paddy Crop, Paddy Crop-TeluguStop.com

మన భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంటగా వరి పంటను( Paddy Crop ) చెప్పుకోవచ్చు.అయితే కొంతమంది రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం అనవసర రసాయన ఎరువులు, పురుగు మందులను అధిక విస్తీర్ణంలో ఉపయోగిస్తున్నారు.

దీంతో పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు నాణ్యమైన వరి పంట దిగుబడులు పొందలేకపోతున్నారు.వరి పంటకు వివిధ రకాల చీడపీడల లేదంటే తెగుళ్ల బెడద చాలా తక్కువగా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

అవి ఏమిటో చూద్దాం.

Telugu Agriculture, Paddy Crop, Paddycrop, Paddy, Weed-Latest News - Telugu

వరి పంట వేసే పొలాన్ని ముందుగా భూసార పరీక్షలు చేపించాలి.అప్పుడు భూమి లోపల ఉండే లోపాలు తెలుస్తాయి.ఆ తర్వాత వేసవికాలంలో( Summer ) లోతు దుక్కులు దున్ని, ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించాలి.

వరి పంట వేసే ముందు పచ్చిరొట్ట పైర్లను వేసి, పూత దశలో ఉన్నప్పుడు బురదలో పొలాన్ని కలియదున్ని మగ్గనివ్వాలి.భూమి యొక్క స్వభావాన్ని బట్టి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి.

పొలంలోనే కాదు పొలం గట్లపై కూడా కలుపు మొక్కలు( Weed Plants ) పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Telugu Agriculture, Paddy Crop, Paddycrop, Paddy, Weed-Latest News - Telugu

ఇక మేలురకం తెగులు నిరోధక రకాలను మాత్రమే సాగుకు ఎంపిక చేసుకోవాలి.ముఖ్యంగా సుడిదోమ, ఉల్లికోడు, అగ్గి తెగులు లాంటి చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేయాలి.నాట్లు ఆలస్యం కాకుండా తొందరగా వేయాలి.

సుడిదోమ ఆశించిన ప్రాంతాలలో కాలిబాటలు వేయడం తప్పనిసరి.సరైన పద్ధతిలో నీరు పొలంబడిలో నిలువ ఉండేలా నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.

ఒకవేళ వరి నాట్లు వేయడం ఆలస్యమైతే నారు కొనలను తుంచి నాటు వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube