విమానంలో భారత ఎన్నారై కక్కుర్తి తి పని..చివరికి అరెస్ట్ అయ్యాడు

ఓ భారత ఎన్నారై అరెస్ట్ అయిన వైనం చూస్తే జాలి పడాలో, ఇదేమి కక్కూర్తి పని అని తిట్టుకోవాలో అర్థం కాదు.ఇంత చిన్న కారణంతో అరెస్ట్ అవ్వడం చూస్తే బహుశా సదరు ఎన్నారై కి జేబులోనే దరిద్రం ఉన్నట్టుగా అనిపిస్తుంది.

 Passenger Of Kuwait Ahmedabad Flight Arrested-TeluguStop.com

ఇంతకీ ఆ కక్కూర్తి పని ఏంటని అనుకుంటున్నారా.ఈ కక్కూర్తి వివరాలలోకి వెళ్తే

కువైట్ నుంచీ ఇండియాకి వస్తున్న ఓ విమానం కొన్ని గంటల్లో భారత్ లో ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది.

ఈ లోగా ఇండియాకి చెందిన ఓ ఎన్నారై బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.ఎయిర్‌హోస్టెస్ అతడికి ఎలాంటి సాయం కావాలో అందించి వెళ్ళిపోయింది.

కాస్సేపటి తరువాత ఈ లోగా బాత్ రూమ్ నుంచీ ఏవో శబ్దాలు వినిపించాయి.కంగారుపడిన ఎయిర్‌హోస్టెస్ బాత్ రూమ్ తలుపు గట్టిగా తట్టి బయటకి రమ్మని పిలిచింది.

Telugu Indiansinkuwait, Cigarette, Toilet Aircraft-

కాసేపటి తరువాత బయటకి వచ్చిన ఆసిఫ్ రంగ్రేజ్ అనే ఎన్నారై ఏమి లేదని వెళ్ళిపోతున్న సమయంలో బాత్ రూమ్ నుంచీ సిగరెట్ వాసన విపరీతంగా వచ్చింది.దాంతో ఆ ఎయిర్‌హోస్టెస్ ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకి తెలియచేసింది.దాంతో భారత్ లో విమానం ల్యాండ్ అవ్వగానే అతడిని అరెస్ట్ చేసి పలు కేసులు నమోదు చేశారు.ఒక్క గంటలో దిగిపోతాడు అనుకున్నా సరే సిగరెట్ తాగాలనే కక్కూర్తి అతడిని అరెస్ట్ వరకూ తీసుకువెళ్ళింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube