విమానంలో భారత ఎన్నారై కక్కుర్తి తి పని..చివరికి అరెస్ట్ అయ్యాడు

ఓ భారత ఎన్నారై అరెస్ట్ అయిన వైనం చూస్తే జాలి పడాలో, ఇదేమి కక్కూర్తి పని అని తిట్టుకోవాలో అర్థం కాదు.

ఇంత చిన్న కారణంతో అరెస్ట్ అవ్వడం చూస్తే బహుశా సదరు ఎన్నారై కి జేబులోనే దరిద్రం ఉన్నట్టుగా అనిపిస్తుంది.

ఇంతకీ ఆ కక్కూర్తి పని ఏంటని అనుకుంటున్నారా.ఈ కక్కూర్తి వివరాలలోకి వెళ్తే కువైట్ నుంచీ ఇండియాకి వస్తున్న ఓ విమానం కొన్ని గంటల్లో భారత్ లో ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది.

ఈ లోగా ఇండియాకి చెందిన ఓ ఎన్నారై బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.

ఎయిర్‌హోస్టెస్ అతడికి ఎలాంటి సాయం కావాలో అందించి వెళ్ళిపోయింది.కాస్సేపటి తరువాత ఈ లోగా బాత్ రూమ్ నుంచీ ఏవో శబ్దాలు వినిపించాయి.

కంగారుపడిన ఎయిర్‌హోస్టెస్ బాత్ రూమ్ తలుపు గట్టిగా తట్టి బయటకి రమ్మని పిలిచింది.

"""/"/ కాసేపటి తరువాత బయటకి వచ్చిన ఆసిఫ్ రంగ్రేజ్ అనే ఎన్నారై ఏమి లేదని వెళ్ళిపోతున్న సమయంలో బాత్ రూమ్ నుంచీ సిగరెట్ వాసన విపరీతంగా వచ్చింది.

దాంతో ఆ ఎయిర్‌హోస్టెస్ ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకి తెలియచేసింది.దాంతో భారత్ లో విమానం ల్యాండ్ అవ్వగానే అతడిని అరెస్ట్ చేసి పలు కేసులు నమోదు చేశారు.

ఒక్క గంటలో దిగిపోతాడు అనుకున్నా సరే సిగరెట్ తాగాలనే కక్కూర్తి అతడిని అరెస్ట్ వరకూ తీసుకువెళ్ళింది.

ఆ రీజన్ వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!