Naa Saami Ranga : నా సామి రంగా రివ్యూ ఇచ్చిన పరుచూరి.. అలా చేయకుంటే బాగుండేది అంటూ?

నాగార్జున ( Nagarjuna ).హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకేక్కినటువంటి చిత్రం నా సామిరంగా ( Naa Samiranga ) ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Paruchuri Gopala Krishna Talks About Naa Saami Ranga Movie To-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.ఇక ఈ సినిమా గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ( Parachuri Gopala Krishna ) తన అభిప్రాయాలను తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నాగార్జున ఈ సినిమాలో కళ్ళతోనే ప్రేక్షకులను అల్లరించారని ఆయన లుక్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు.

ఈ సినిమా టాక్ పరంగా మంచి సక్సెస్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఇంకా మంచి కలెక్షన్ రాబట్టాల్సి ఉండేదని తెలిపారు.ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం రొమాన్స్ అలాగే కామెడీని పండించారు.ఇక ఇంటర్వెల్ ముందు రావు రమేష్( Rao Ramesh ) చనిపోవడం సినిమాకు మైనస్ గా మారిందని అలా ఆయన పాత్రను చంపడంతో సెకండ్ హాఫ్ లో మరొక విలన్ వస్తారని ప్రేక్షకులకు అర్థమవుతుంది .ఈయన పాత్రను చంపేయకుండా ఉంటే బాగుండేదని తెలిపారు.

ఇక అల్లరి నరేష్ పాత్రను కూడా చంపేయటం మైనస్ గా మారింది.హీరో మనుషులను చంపేయటం ప్రేక్షకులు దానిని యాక్సెప్ట్ చేయలేదని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.ఎప్పుడైనా సినిమా హిట్ అవ్వాలి అంటే హీరో విలన్లను చంపుతూ పోవాలి కాని హీరో మనుషులని విలన్ చంపితే ఆ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ఈయన తెలిపారు.

లక్కీగా ఈ సినిమా బయటపడిందని అయితే ఈ రెండు పాత్రలను చంపేయకుండా ఉండి ఉంటే కనుక మరిన్ని వసూళ్లను రాబట్టేది అంటూ ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ నా సామిరంగా సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube