పాక్‌, చైనా కలిసి భారత్ పై కుట్రలు... కానీ, జరుగుతున్నది ఇదే!

ఇరుగుపొరుగున వున్న చైనా( China ), పాకిస్థాన్ దేశాలు ఎప్పుడూ భారత్( India ) పైన విషం చిమ్ముతూనే ఉంటాయి.ఈ క్రమంలో ఈ రెండు దేశాలు జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ ను నిలదీయాలని, పోరాడాలని, దోచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి.

 Pakistan And China Are Conspiring Against India... But This Is What Is Happening-TeluguStop.com

వివిధ దేశాలకు ఎక్కువ అప్పులు ఇచ్చి చైనా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూడగా పాకిస్థాన్ అనేది అసాంఘిక కార్యకలాపాల ద్వారా వివిధ దేశాలకు దగ్గర కావాలని చూస్తూ ఉంటుంది.అయితే పాక్ ఇపుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి భారత్ పై కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.

ఈ తరుణంలో చైనా పాకిస్థాన్ కు బదులుగా కాశ్మీర్ అంశంపై మాట్లాడటం మొదలు పెట్టింది.

చైనా, పాకిస్థాన్ లు భారత్ లోని లడక్, కాశ్మీర్( Ladakh ) ప్రాంతాలపై ఇష్టారీతిన విమర్శలు చేసిన విషయం విదితమే.దీన్ని అక్కడ ఉన్న భారత యువ ప్రతినిధులు దీటుగా తిప్పికొట్టడం కూడా జరిగింది.

కేంద్రం తీసేసిన ఆర్టికల్ 370, 35 కారణంగా అక్కడ భారత రాజ్యాంగం అమలు చేయడానికే వీలు పడుతుంది.గతంలో ఈ చట్టాల కారణంగా ఇండియా నుంచి ఫండ్స్ మాత్రమే ఇచ్చి అభివృద్ది చేసేవారు.కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఇండియా పౌరులెవరూ భూములు కొనకుండా, స్థిర జీవనం ఏర్పరచు కోకుండా చట్టాలు అడ్డు వచ్చేవి.

దీంతో కాశ్మీర్ అభివృద్ధిలో వెనకడుగు వేసిందని చెప్పుకోవచ్చు.అలాగే తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు చేసిన కృషిలో ఇది ఎంతో తోడ్పడుతుంది కూడా.కానీ చైనా లడక్ లో అంతర్గత ప్రాంతమని వాదనలకు దిగుతోంది.పాకిస్థాన్ కాశ్మీర్ లో భారత్ పెత్తనంపై ఎల్లప్పుడూ అసూయగానే ఉంటుంది.అయినా భారత ప్రభుత్వం అక్కడ శాంతిని నెలకొల్పాలని తీసుకున్న నిర్ణయం ఆ 2 దేశాలకు ఇపుడు మింగుడు పడటం లేదు.ఈ తరుణంలో పలు సదస్సులలో ఇండియా తరఫున వెళుతున్న ప్రతినిధుల బృందాలు చెబుతున్న సమాధానాలు విని పాక్ చైనా అవాక్కవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube