పాక్, చైనా కలిసి భారత్ పై కుట్రలు… కానీ, జరుగుతున్నది ఇదే!
TeluguStop.com
ఇరుగుపొరుగున వున్న చైనా( China ), పాకిస్థాన్ దేశాలు ఎప్పుడూ భారత్( India ) పైన విషం చిమ్ముతూనే ఉంటాయి.
ఈ క్రమంలో ఈ రెండు దేశాలు జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ ను నిలదీయాలని, పోరాడాలని, దోచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి.
వివిధ దేశాలకు ఎక్కువ అప్పులు ఇచ్చి చైనా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూడగా పాకిస్థాన్ అనేది అసాంఘిక కార్యకలాపాల ద్వారా వివిధ దేశాలకు దగ్గర కావాలని చూస్తూ ఉంటుంది.
అయితే పాక్ ఇపుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి భారత్ పై కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.
ఈ తరుణంలో చైనా పాకిస్థాన్ కు బదులుగా కాశ్మీర్ అంశంపై మాట్లాడటం మొదలు పెట్టింది.
"""/" /
చైనా, పాకిస్థాన్ లు భారత్ లోని లడక్, కాశ్మీర్( Ladakh ) ప్రాంతాలపై ఇష్టారీతిన విమర్శలు చేసిన విషయం విదితమే.
దీన్ని అక్కడ ఉన్న భారత యువ ప్రతినిధులు దీటుగా తిప్పికొట్టడం కూడా జరిగింది.
"""/" /
కేంద్రం తీసేసిన ఆర్టికల్ 370, 35 కారణంగా అక్కడ భారత రాజ్యాంగం అమలు చేయడానికే వీలు పడుతుంది.
గతంలో ఈ చట్టాల కారణంగా ఇండియా నుంచి ఫండ్స్ మాత్రమే ఇచ్చి అభివృద్ది చేసేవారు.
కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఇండియా పౌరులెవరూ భూములు కొనకుండా, స్థిర జీవనం ఏర్పరచు కోకుండా చట్టాలు అడ్డు వచ్చేవి.
"""/" /
దీంతో కాశ్మీర్ అభివృద్ధిలో వెనకడుగు వేసిందని చెప్పుకోవచ్చు.అలాగే తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు చేసిన కృషిలో ఇది ఎంతో తోడ్పడుతుంది కూడా.
కానీ చైనా లడక్ లో అంతర్గత ప్రాంతమని వాదనలకు దిగుతోంది.పాకిస్థాన్ కాశ్మీర్ లో భారత్ పెత్తనంపై ఎల్లప్పుడూ అసూయగానే ఉంటుంది.
అయినా భారత ప్రభుత్వం అక్కడ శాంతిని నెలకొల్పాలని తీసుకున్న నిర్ణయం ఆ 2 దేశాలకు ఇపుడు మింగుడు పడటం లేదు.
ఈ తరుణంలో పలు సదస్సులలో ఇండియా తరఫున వెళుతున్న ప్రతినిధుల బృందాలు చెబుతున్న సమాధానాలు విని పాక్ చైనా అవాక్కవుతున్నాయి.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?