తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది.నిన్న రాత్రి మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఘాట్ రోడ్డులోని ఏనుగుల ఆర్చి సమీపంలో చిరుత ప్రత్యక్షమైంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఆపరేషన్ చిరుతను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగానే చిరుతలను పట్టుకునేందుకు మహారాష్ట్ర నుంచి అధునాతన బోన్లను తెప్పించారు ఫారెస్ట్ అధికారులు.మరోవైపు స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఎలుగుబంటి దర్శనమిచ్చింది.
ఇప్పటికే మూడు చిరుతలను పట్టుకున్న అధికారులు భక్తుల భద్రత నేపథ్యంలో మిగతా చిరుతలను పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశారు.అదేవిధంగా 300 కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన టీటీడీ మరో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలను చేపట్టారు.