ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణమాసం( Sravanamasam ) పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మహిళలంతా వరలక్ష్మి వ్రతం( Varalakshmi Vratam ) జరుపుకుంటారు.అమ్మవారిని చక్కగా అలంకరించి పూజలు చేసి నైవైద్యాలు పెడతారు.
అయితే ఈ పూజా కోసం ప్రతి సంవత్సరం బంగారు లక్ష్మీ రూపు కొంటారు.ప్రతి ఏడాది కొనాలని ఏమైనా రూల్ ఉందా? ఉంటే ఎవరు కొనాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వరలక్ష్మి దేవికి పూజ నిర్వహించే సమయంలో మహిళలు బంగారు లక్ష్మీ రూపు కొని పూజలో పెడతారు.
పూజ చేసిన తర్వాత వాటిని నల్ల పూసల మధ్య గుచ్చుకుంటూ ఉంటారు.అయితే ప్రతి సంవత్సరం లక్ష్మీరూపు కొనుక్కోవాలని రూలు ఉందా అంటే లేదని ధర్మశాస్త్రం( Law ) చెబుతూ ఉంది.ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించి అవకాశం ఉంటే కొనవచ్చు.
అయితే ఈ లక్ష్మీ రూపు ఎవరు కొని ఇవ్వాలి అని కూడా చాలామందికి అనుమానం కలుగుతూ ఉంటుంది.పూజ చేసుకునే ప్రతి మహిళకి ఆమె భర్త లక్ష్మీ రూపు ను కొని ఇవ్వడం ఎంతో మంచిది.
కొనలేని పరిస్థితి ఎదురైనప్పుడు పాత లక్ష్మీరూపమైన పూజలో పెట్టవచ్చు.పూజ రోజు భర్త కొని తెచ్చిన కొత్త చీరలు మాత్రమే కట్టుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే కొత్త పట్టుచీర ఉండాలనే నియమం ఏమీ లేదు.
పాత పట్టు చీర అయిన, పెళ్లి పట్టు చీరతో అయినా పూజ చేయవచ్చు.పూజ తర్వాత 8 సంఖ్యకు తగ్గకుండా వాయినం ఇవ్వాలి.అష్ట లక్ష్ములు 8 మంది కాబట్టి 8 మంది మహిళలను అష్ట లక్ష్ములుగా భావిస్తూ వాయినం ఇవ్వాలి.
అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు లక్ష్మి రూపును అప్పుచేసి కొనకూడదు.ఉన్నంతలో మాత్రం పూజ కచ్చితంగా చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది.ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 25 శుక్రవారం జరుపుకోనున్నారు.