నాగార్జున, జగపతి బాబు, రమేష్ బాబు.. ఈ ముగ్గురు మధ్య పోలిక మీకు తెలుసా?

దాదాపు 3 దశాబ్దాల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగారు రమేష్ బాబు, జగపతి బాబు, నాగార్జున లు.ముగ్గురు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చింది దాదాపు ఒకే సమయంలో అని చెప్పాలి.

 One Similarity In Nagarjuna, Jagapathi Babu And Ramesh Babu, Jagapathi Babu, Ram-TeluguStop.com

ఇక ఆ తర్వాత ప్రస్తుతం నాగార్జున ఇప్పటికి సార్ హీరో గా ఉంటె జగపతి బాబు విలన్ గా మారిపోయాడు.ఇక మొదట్లో దూకుడు చూపించిన రమేష్ బాబు ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.

ఇటీవలే హఠాత్ మరణం చెందారు అన్న విషయం తెలిసిందే.అయితే ఈ ముగ్గురు హీరోల మధ్య ఒక పోలిక ఉంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bethab, Jagapathibabu, Nagarjuna, Ramesh Babu, Simha Swapanam, Vikram-Mov

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు విక్రమ్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున.1986 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిందీలో జాకీ ష్రాఫ్ మీనాక్షి శేషాద్రి కాంబినేషన్లో హీరో అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.

మంచి విజయం సాధించిన ఈ హిట్ మూవీ తెలుగులో రీమేక్ చేసి నాగార్జున మంచి విజయం సాధించాడు.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా కు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.ఇక ఇది అటు హిందీలో కూడా జాకీష్రాప్ కి మొదటి సినిమా కావడం గమనార్హం.

Telugu Bethab, Jagapathibabu, Nagarjuna, Ramesh Babu, Simha Swapanam, Vikram-Mov

ఇక రమేష్ బాబు విషయానికి వస్తే సూపర్ స్టార్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.సామ్రాట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక కృష్ణ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు.హిందీలో సూపర్ హిట్టయిన బెతాబ్ మూవీ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

బేతా బ్ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ కి ఈ సినిమా మొదటి సినిమా కావడం గమనార్హం.ఈ సినిమాకి వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.1987 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Telugu Bethab, Jagapathibabu, Nagarjuna, Ramesh Babu, Simha Swapanam, Vikram-Mov

ఇక జగపతి బాబు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.సింహస్వప్నం అనే సినిమాతో హీరోగా మారిపోయాడు.

మొదటి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసాడు జగపతిబాబు.హిందీలో సూపర్ హిట్టయిన కత్రోకీ కిలాడీ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఈ సినిమాని స్వయంగా జగపతి బాబు తండ్రి నిర్మించడం గమనార్హం.ఈ సినిమాకి కూడా వి.మధుసూదనరావు డైరెక్టర్గా పనిచేశారు.1989 ఫిబ్రవరి మూడో తేదీన ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి రికార్డులు కొట్టింది.ఇలా ఈ ముగ్గురు హీరోలు హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగు రీమేక్ చేయడమే కాదు ఓకే దర్శకుడు సినిమా లో చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube