నాగార్జున, జగపతి బాబు, రమేష్ బాబు.. ఈ ముగ్గురు మధ్య పోలిక మీకు తెలుసా?
TeluguStop.com
దాదాపు 3 దశాబ్దాల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగారు రమేష్ బాబు, జగపతి బాబు, నాగార్జున లు.
ముగ్గురు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చింది దాదాపు ఒకే సమయంలో అని చెప్పాలి.
ఇక ఆ తర్వాత ప్రస్తుతం నాగార్జున ఇప్పటికి సార్ హీరో గా ఉంటె జగపతి బాబు విలన్ గా మారిపోయాడు.
ఇక మొదట్లో దూకుడు చూపించిన రమేష్ బాబు ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.
ఇటీవలే హఠాత్ మరణం చెందారు అన్న విషయం తెలిసిందే.అయితే ఈ ముగ్గురు హీరోల మధ్య ఒక పోలిక ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు విక్రమ్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున.
1986 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిందీలో జాకీ ష్రాఫ్ మీనాక్షి శేషాద్రి కాంబినేషన్లో హీరో అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.
మంచి విజయం సాధించిన ఈ హిట్ మూవీ తెలుగులో రీమేక్ చేసి నాగార్జున మంచి విజయం సాధించాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా కు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
ఇక ఇది అటు హిందీలో కూడా జాకీష్రాప్ కి మొదటి సినిమా కావడం గమనార్హం.
"""/"/ ఇక రమేష్ బాబు విషయానికి వస్తే సూపర్ స్టార్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.
సామ్రాట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక కృష్ణ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు.
హిందీలో సూపర్ హిట్టయిన బెతాబ్ మూవీ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
బేతా బ్ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ కి ఈ సినిమా మొదటి సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమాకి వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
1987 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. """/"/ ఇక జగపతి బాబు నిర్మాత వి.
బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
సింహస్వప్నం అనే సినిమాతో హీరోగా మారిపోయాడు.మొదటి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసాడు జగపతిబాబు.
హిందీలో సూపర్ హిట్టయిన కత్రోకీ కిలాడీ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఈ సినిమాని స్వయంగా జగపతి బాబు తండ్రి నిర్మించడం గమనార్హం.ఈ సినిమాకి కూడా వి.
మధుసూదనరావు డైరెక్టర్గా పనిచేశారు.1989 ఫిబ్రవరి మూడో తేదీన ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి రికార్డులు కొట్టింది.
ఇలా ఈ ముగ్గురు హీరోలు హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగు రీమేక్ చేయడమే కాదు ఓకే దర్శకుడు సినిమా లో చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు.
కంటి ఆరోగ్యానికి అండగా ఉండే ఈ ఆహారాలు మీరు తింటున్నారా..?