పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మొన్నటి వరకు వారాహి యాత్రలో బిజీగా ఉండడంతో షూటింగులకు బ్రేక్ ఇచ్చిన విషయం విదితమే.దీంతో ఈయన లైనప్ లో ఉన్న సినిమాలన్నీ షూటింగులు ఆగిపోయాయి.
మరి పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఓజి ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి( OG Movie )ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.
ఇక మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుండడంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.
డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా గ్లింప్స్ గురించి నెట్టింట ఒక వార్త క్రేజీగా మారింది.పవన్ కళ్యాణ్ బర్త్ డే అతి త్వరలోనే రాబోతుంది.
సెప్టెంబర్ 2న ఈయన తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు.మరి బర్త్ డే కానుకగా ఓజి మేకర్స్ కూడా అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదే రోజు ఈ సినిమా నుండి ఓజి గ్లింప్స్ వస్తుందని టాక్.అంతేకాదు ఈ వీడియోకు కోలీవుడ్ యంగ్ నటుడు అర్జున్ దాస్( Arjun Das ) తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారని అంటున్నారు.ఇదే నిజమైతే ఈయన వాయిస్ తో ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవల్లో ఉండే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.