చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి.ఈ మేరకు కుప్పంలో చంద్రబాబు ఇంటిని నిర్మించుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో ఇంటి నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.కాగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అక్కడ సొంత ఇంటి నిర్మాణం కోసం సంవత్సరన్నర కాలం కిందట స్థలం కొనుగోలు చేసి ప్రహరీ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంలో జాప్యం కొనసాగిందని తెలుస్తోంది.తాజాగా మూడు రోజుల క్రితం పీఎంకే ఉడా నుంచి అనుమతులు లభించాయి.