భారతదేశంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసే మొదటి మూడు అంశాలలో ఒకటి సినిమాలు రెండు రాజకీయాలు మూడు క్రికెట్.ఈ మూడింటిని విడదీసి చూడడం చాలా కష్టం ముఖ్యంగా రాజకీయ రంగం లోకి ఎంటర్ అవుతున్న చాలామంది నేతలు మిగతా రెండు కేటగిరీల నుంచి వస్తున్నారు.
ఇప్పటికే అనేకమంది సినిమా నటులు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ముఖ్యమంత్రి పదవులు కూడా చేపట్టారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తో పాటు తమిళనాడులో( Tamil Nadu ) అయితే దశాబ్దాల దశాబ్దాల పాటు అధికారాన్ని చలాయించారు .ప్రజలు కూడా సినిమా రంగం నుంచి వచ్చిన నటులకు బ్రహ్మరదం పట్టి ఆరాధ్య భావంతో ఓట్లు వేసి వారిని గెలిపిస్తూ ఉంటారు.ఇటీవల క్రీడా రంగం నుంచి కూడా అనేకమంది క్రీడా ప్రముఖులు రాజకీయ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇప్పుడు తమిళనాడులో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటుడు సూర్య( Actor Surya ) కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ దిశగా తమిళనాడు అంతా పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది.తన అగరం ఫౌండేషన్( Agaram Foundation ) ద్వారా భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే సూర్య పట్ల తమిళనాడులో విశిష్ట గౌరవం ఉంది.అంతేకాకుండా సినిమా రంగం లో కూడా అగ్ర నటుడు అవడం వల్ల ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది.
దాంతో వచ్చే ఎన్నికలలో ఆయన తమిళ రాజకీయలలో( Tamil politics ) నూతన అధ్యాయానికి తెరతీయబోతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి స్పందన సూర్య నుంచి రాలేదు ఇది ఇది కేవలం ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆశ పడుతున్న కొంత మంది అభిమానులు అత్యుత్సాహమే తప్ప సూర్య ఇప్పుడే రాజకీయాల్లోకి రాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే సినిమా హీరోగా ఆయనకు ఇంకా చాలా కెరియర్ మిగిలి ఉందని ఇప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతే ఇక సినిమా రంగంలో ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుందని, సినిమా రిలీజు లకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుందని చాలామంది అనుభవాలు రుజువు చేస్తున్నందున సూర్య ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం చేయకపోవచ్చు అని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు .సూర్య వైపు నుంచి స్పష్టత వస్తే తప్ప ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.