సినిమా ఇండస్ట్రీలో ఒక ధ్రువతారగా వెలుగొందిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అని చెప్పాలి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనే బిరుదుని కైవసం చేసుకున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి సినిమాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఆయన ఏ పని లో ఉన్న సినిమాని మాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదు ఎందుకంటే తనకి ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఏంటో తెలుసు.
ఈమధ్య ఎన్టీఆర్ బయోపిక్ గా కథానాయకుడు, మహా నాయకుడు అనే సినిమాలు వచ్చాయి దాంట్లో హీరోగా బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రని పోషించాడు అలాగే హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రని పోషించాడు.ఆ సినిమాలో చూపించినట్టుగా తన కొడుకు చనిపోయాడు అని తెలిసిన కూడా ఎన్టీఆర్ వెళ్లకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తాడు ఎందుకంటే తాను ఎవరికైనా ఒక కమిట్మెంట్ ఇస్తే అది పూర్తయిన తర్వాత ఇంకొక పని చేసేవాడు తన ఫ్యామిలీ ప్రాబ్లం లో ఉన్నా కూడా తనకు ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉండడమే ఇంపార్టెంట్ అని ఆలోచించే ఏకైక వ్యక్తి.
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కూడా తన ఇంట్లో జరిగే చాలా శుభకార్యాలకి అటెండ్ కాకుండా జనం బాగు కోసం అనుక్షణం తపించే వ్యక్తిగా ఒక మంచి మనసున్న మనిషిగా జనానికి మంచి చేయడం కోసం పరితపిస్తూ ఉండేవాడు అలాంటి వ్యక్తి ఎన్టీఆర్.ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసత్వాన్ని స్వీకరించిన హరికృష్ణ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు కానీ ఆయన తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అగ్ర హీరోగా ఇండస్ట్రీలో వెలుగొందాడు .
అయితే కొందరు మాత్రం బాలకృష్ణ మ్యారేజ్ కూడా అలా ఏదో ఒక సంబంధం సెట్ చేసి బాలకృష్ణ కి పెళ్లి చేశారని కొంతమంది అంటుంటారు ఎందుకంటే బాలకృష్ణ హీరోగా ఉన్నప్పుడు చెన్నైలో ఎవరినో లవ్ చేస్తూ చెన్నై మొత్తం ఆమెతో తిరుగుతున్నాడని ఒక వార్త ఎన్టీఆర్ గారి చెవిన పడడంతో ఆయన లేట్ చేయకుండా ఒక సంబంధం చూసి బాలకృష్ణ కి పెళ్లి చేశారని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు.అయితే ఎన్టీఆర్ చిన్న కొడుకు అయిన జయ కృష్ణ చాలా రోజుల పాటు రామకృష్ణ,ఎన్టీఆర్ లతోనే ఉండేవాడు.ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అని ఎన్టీఆర్ అడగలేదు నన్ను నేను పెళ్లి చేసుకుంటానని జయకృష్ణ చెప్పకపోవడంతో చాలా రోజుల పాటు రామకృష్ణ ఎన్టీఆర్ లతోనే కాలం గడిపాడు.
అయితే చాలా రోజులకి ఎన్టీఆర్ చేయాల్సిన జయ కృష్ణ పెళ్లి నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా తిరుపతిలో జరిగింది.చాలా సింపుల్ గా తిరుపతిలో పెళ్లి చేయడాన్ని చూసిన జయ కృష్ణ కి తను సీఎం కొడుకు అయ్యుండి ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడం తనకి నచ్చలేదు కానీ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆయన పెళ్లి అలా జరిగిపోయిందని ఇప్పటికీ చెప్పుకుంటారు అయితే ఎన్టీఆర్ గురించి నాదెండ్ల భాస్కర్ చెబుతూ ఎన్టీఆర్ ఇంట్లో ఏ ప్రాబ్లం జరిగిన వచ్చేవాడు కాదు సరిగ్గా రెస్పాండ్ అయ్యే వాడు కూడా కాదు.అతను కొడుకు ల గురించి అసలు ఆలోచించకపోయేది తన ఫ్యాన్స్ కి జనాలకి కలరింగ్ ఇవ్వడానికి తను వాళ్ళ కొడుకు పెళ్లికి గాని చనిపోయినప్పుడు గాని అంత తొందరగా రాకపోయే వాడు అది చూసిన ఫ్యాన్స్ జనాలు ఫ్యామిలీ కంటే కూడా ఎన్టీఆర్ కి మనం అంటేనే ఎక్కువ ఇష్టం అని అనుకొని ఆయన మీద అభిమానం ఇంకా పెంచుకోవాలని మాత్రమే అలా చేసేవాడు అని చెప్పుకొచ్చాడు.
ఎవరు ఏమి అనుకున్నా ఎన్టీఆర్ మాత్రం ఒక లెజండరీ యాక్టర్ గా ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల పాటు తన హవా ని కొనసాగించిన అనంతరం తను పొలిటికల్ పార్టీ పెట్టి సి ఎం అయి ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.