Devara : ఎన్టీఆర్ దేవర ఇంటర్వెల్ సీన్ కు గూస్ బంప్స్.. భలే క్రేజీగా ప్లాన్ చేశారంటూ?

జూనియర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర( Devara movie )ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దేవర సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 Ntr Devara Movie Latest Update Viral On Social Media-TeluguStop.com

ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవ్వగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.షూటింగ్ ఎక్కడ కూడా నిలబడకుండా శరవేగంగా జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు దేవర ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్ ను వేస్తున్నారు.

Telugu Devara Latest, Devara, Janhvi Kapoor, Koratala Siva, Ntr, Tollywood-Movie

ఈ క్రేజీ సెట్ లో రెండు వారాల పాటు దేవర యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయవున్నారట.ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ కి ముందు వస్తుందట.ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం.

ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతుంది వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva ) ఎన్టీఆర్ డేట్స్ తో పాటుగా మిగతా కీలక నటుల డేట్స్ అన్నింటిని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటూ లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నారట.

దానితో ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది అని అక్టోబర్, నవంబర్ లోపు షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Devara Latest, Devara, Janhvi Kapoor, Koratala Siva, Ntr, Tollywood-Movie

ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే.గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్( RRR ) మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఇక జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో దేవర సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఆ భారీ అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.మరి ఎన్టీఆర్ దేవర సినిమా ఎలా ఉండనుంది.అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరుగుతుందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube